Sangareddy District Police Updates WhatsApp Channel

Sangareddy District Police Updates

1.5K subscribers

About Sangareddy District Police Updates

Our top priority and motto is to serve and protect every individual, ensuring safety and justice for all.

Similar Channels

Swipe to see more

Posts

Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/24/2025, 11:23:42 AM
Post image
Image
Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/24/2025, 11:23:42 AM
Post image
Image
Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/27/2025, 3:08:19 PM

జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 27.05.2025, *• పశువుల అక్రమ రవాణాను నియంత్రిస్తూ.., జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.* బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల /పశువుల అక్రమ రవాణ జరగకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కంది, ముత్తంగి చెక్ పోస్ట్ లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, పశువుల అక్రమ రవాణ జరగకుండా చూడాలని అన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, నైట్ టైమ్ చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహించే సిబ్బంది, లైట్ బాటన్, రెఫ్లెక్షన్ జాకెట్ ధరించాలని సూచించారు.

Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/24/2025, 11:23:42 AM
Post image
Image
Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/24/2025, 11:23:41 AM
Post image
Image
Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/24/2025, 11:23:43 AM
Post image
Image
Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/27/2025, 3:08:31 PM
Post image
Image
Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/27/2025, 3:08:31 PM
Post image
Image
Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/24/2025, 11:23:41 AM
Post image
Image
Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
5/24/2025, 11:23:36 AM

జిల్లా పోలీస్ కార్యాలయం సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 24-05-2025. *• పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కోర్టు డ్యూటి అధికారులతో కో-ఆర్డినేషన్ మీటింగ్..* *• వీలైనన్ని ఎక్కువ కేసులలో దోషులకు శిక్ష పడేలా చూడాలి.. మర్డర్, పోక్సో, అత్యాచార మరియు మాదక ద్రవ్యాల కేసులలో దోషులు తప్పించుకోవడానికి వీలులేదు..* *• చట్టం ముందు దోషులకు శిక్ష పడినప్పుడే తిరిగి నేరం చేయడానికి వెనకడుగు వేస్తారు.., ప్రజలలో పోలీసుల పై నమ్మకం పెరుగుతుంది. : జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు.* ఈ రోజు తేది: 24.05.2025 నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కోర్టు డ్యూటి అధికారులతో కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ను త్వరితగతిన పూర్తి చేసి, నిర్ణీత సమయంలో కేస్ ఫైల్ కోర్టు కు పంపేవిధంగా చూడాలని డియస్పీలకు సూచించారు. కోర్ట్ డ్యూటి అధికారులు చార్జ్ షీట్ దాకలు మొదలుకొని, తీర్పు వెలువడే వరకు ఫిర్యాది, బాదితులకు అండగా ఉంటూ, నిందితులు సాక్షులను ఇబ్బందులు కలిగించకుండా చూడాలన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులో దోషులకు శిక్ష పడేలా చూడాలని, పోక్సో, అత్యాచార కేసులలో దోషులు తప్పించుకోవడానికి వీలులేదు అన్నారు. చట్టం ముందు దోషులకు శిక్ష పడినప్పుడే తిరిగి నేరం చేయడానికి వెనకడుగు వేస్తారని, ప్రజలలో పోలీసుల పై నమ్మకం పెరుగుతుందని అన్నారు. కోర్ట్ డ్యూటి అధికారులు కోర్ట్ అధికారులతో మంచి కమ్యూనికేషన్ కలిగి వివిధ కేసులలో ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని, శిక్ష పడేలా ఫిర్యాది, సాక్షులకు గైడ్ చేయాలని అన్నారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కోర్ట్ డ్యూటి పోలీసు అధికారులు వారానికి ఒక్కసారి సంభందిత యస్.హెచ్.ఓ లతో కో-ఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని, వివిధ కేసులల్లో సమన్స్, కేసు ప్రాపర్టీ వంటి అంశాల గురించి చర్చించాలని అన్నారు. డ్యూటి పరంగా ఎలాంటి సమస్యలున్న నేరుగా నా దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ.., విధి నిర్వహణలో అలసత్వం చూపరాదని అన్నారు. అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యం.సత్యనారాయణ మాట్లాడుతూ.. వివిధ కేసులలో సైంటిఫిక్, ఎలక్ట్రానిక్ సాక్షాదారాలు చాలా కీలకం అని, ఈ సాక్షాదారాల వలన నిందితులు తప్పించుకోవడానికి అవకాశం లేదని ప్రతి కేసులో సైంటిఫిక్, వీడియో, ఫోటో గ్రాఫి, చాలా కీలకం అన్నారు. వివిధ కేసులలో యస్.హెచ్.ఓ లకు తగు సలహాలు సూచనలు చేసు, ఎల్లవేళలా సహాయకారిగా ఉంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ అదనపు శ్రీనివాస్ రావ్, సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డియస్పి ప్రభాకర్, నారాయణఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యం. సత్యనారాయణ, రాజేశ్వర్, సూర్ రెడ్డి, విజయ్ శంకర్ రెడ్డి, స్వాతి, లతీఫ్ ఉర్ రహమాన్, రజిత రథోడ్, స్వాతి గౌడ్, సుభాష్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, కోర్ట్ లైజనింగ్ అధికారి సత్యనారాయణ కోర్ట్ డ్యూటి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Link copied to clipboard!