
Sangareddy District Police Updates
February 12, 2025 at 09:43 AM
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన - తేది: 12-02-2025,
*• రానున్న లోకల్ బాడీ, యం.పి.టి.సి. మరియు జెడ్.పి.టి.సి. ఎన్నికల దృష్ట్యా అధికారులందరు అప్రమత్తంగా వుండాలి..*
*• గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన ట్రబుల్ మాంగర్స్ ను సత్:ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బైండోవర్ చేయాలి..*
*• ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఎన్నికల వేలా గ్రామ పరిస్థితులను తెలుసుకోవాలి..*
*• ఎన్నికలు ప్రశాంతంగా జరిగేల ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలి..*
*• అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్. గారు.*
ఈ రోజు తేది: 12.02.2025 నాడు జిల్లా పోలీసు కార్యాలయాంలో ఏర్పాటు చేసిన లోకల్ బాడీ, యం.పి.టి.సి. మరియు జెడ్.పి.టి.సి. ఎలెక్షన్స్ రివ్యూ నందు జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేల యస్.హెచ్.ఓ.లు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలి. ప్రతి గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని అన్నారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని సత్: ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బైండోవర్ చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ రోజు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండవలసిన కనీస వసతులను చూసుకోవాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా డబ్బు, మద్యం, క్రికెట్ కిట్ల పంపిణీ మరేయితరములు అక్రమ రవాణా చేయకుండా జిల్లా వ్యాప్తంగా, సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ముమ్మర తనిఖీలు చేయాలని సూచించారు.
ప్రజలెవరైన ఇతర పార్టీలను గాని, వ్యక్తులను గాని కించపరిచే విధంగా వ్యాక్యలు చేయరాదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని సూచించారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగించి, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై, వాట్సప్ గ్రూప్ లలో ఫార్వర్డ్ మెసేజ్ పెట్టిన గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
సిబ్బందిని ఉద్ధేశించి మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది జిల్లా ప్రజలతో సత్: సంబంధాలు కలిగి, ఎలాంటి శాంతి భధ్రతల సమస్యలు తలెత్తకుండా సమాచారాన్ని సేకరించాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేయాలని అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది 24*7 హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని సూచిస్తూ.. జిల్లా కేంద్రం నుండి ఎలాంటి సమాచారని అడిగిన త్వరితగతిన స్పందించాలని అన్నారు.