Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
February 12, 2025 at 12:10 PM
జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 12.02.2025, *• మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నం కేసులో నిందితునికి 3-సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా..* *• న్యాయ స్థానం ముందు దోషులకు శిక్ష పడినప్పుడే, తిరిగి నేరాలు చేయడానికి వెనకడుగు వేస్తారు.* *• నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్. గారు.* నేరం సంఖ్య: 22/2021 సెక్షన్: 354-D ఐపిసి, సెక్షన్ 11 &12 ఆఫ్ పొక్సో యాక్ట్ కోహిర్ పోలీసు స్టేషన్: ఫిర్యాదిరాలు కోహిర్ మండలం, మనియార్ పల్లి గ్రామ నివాసితురాలు, వ్యసాయం చేసుకొని జీవనం సాగిస్తుంది. తేది 01.02.2021 నాడు వ్యవసాయ పనులకై బయటకు వెళ్ళగా, తన కూతురు వయస్సు 17 సంవత్సరాలు ఇంట్లో ఒక్కతే ఉందని గమనించిన పక్కింటి వ్యక్తి/ నిందితుడు బేగరి ఆంజనేయులు అందజా 2 గంటల సమయంలో ఇంటికి వచ్చి తన కూతురు చేయి పట్టి లాగి అత్యాచార ప్రయత్నం చేశాడని, తన కూతురు గట్టిగా అరవడంతో పారిపోయాడని, ఎవరికైనా చెపితే ఫోటోలు సోషల్ మీడియా పెడతానని భయబ్రాంతులకు గురిచేశాడని, తన కూతురిని శారీరకంగా అనుభవించాలనే దురుద్ధేశ్యంతో అత్యాచార ప్రయత్నం చేశాడని, నిందితునిపై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోహిర్ పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన అప్పటి యస్.హెచ్.ఒ. చెల్లా రాజశేఖర్ ఎస్ఐ గారు, ఇన్వెస్టిగేషన్ అనంతరం చార్జ్ షీట్ దాఖలు చేయగా కేసు పూర్వపరాలను విన్న గౌరవ సెషన్స్ పోక్సో జడ్జి శ్రీమతి కె.జయంతి గారు నిందితునికి, 3-సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5-వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. *నిందితుని వివరాలు: బేగరి ఆంజనేయులు తండ్రి ప్రభు, వయస్సు:19 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి, కోట్ మర్పల్లి గ్రామం, మర్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా.* నిందితునికి శిక్షపడేలా ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.సూర్ రెడ్డి, ఇన్వెస్టిగేషన్ అధికారి చెల్లా రాజశేఖర్, ప్రస్తుత ఎస్ఐ జి. సతీష్, భరోసా లీగల్ సపోర్ట్ పర్సన్ సౌజన్య, కోర్ట్ డ్యూటీ హెడ్.కానిస్టేబుల్స్ చంద్రశేఖర్, వెంకటేశ్వర్, శంకర్, కోర్ట్ లైజనింగ్ అధికారి కె.సత్యనారాయణ ఎస్ఐ. గార్లను ఎస్పీ గారు అభినందించారు.

Comments