Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
February 15, 2025 at 01:42 PM
జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 15.02.2025, *• సంగారెడ్డి జిల్లా సాయుధ పోలీసు దళాలకు “వార్షిక పునర్ ఉచ్చరణ” (మొబిలైజేషన్) 15-రోజుల శిక్షణ కార్యక్రమం..* *• పర్సనల్ సెక్యూరిటీ అధికారులు విఐపి భద్రత విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండటానికి వీలులేదు..* *• రోజు వ్యాయామం చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవాలి..* *• విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేసి, ప్రజల మన్ననలు పొందాలి..* *:జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్ గారు.* “వార్షిక పునర్ ఉచ్చరణ” మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రారంభ పరేడ్ కు హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్ గారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 305 మంది ఆర్ముడ్ రిజర్వ్ అధికారులు, సిబ్బందికి ఈ రోజు తేది: 15.02.2025 నుండి 15-రోజుల పాటు ప్రాథమిక శిక్షణను గుర్తు చేస్తూ.. ప్రతి రోజు ఉదయం ఫిజికల్ ట్రైనింగ్ మరియు పెరేడ్, మాబ్ ఆపరేషన్, లాఠీ డ్రిల్, ఆయుధాలపై శిక్షణ, నాకబందిలో పాటించవలసిన మెళకువలు, ఇలా మారుతున్న సామాజానికి అనుగుణంగా విధి నిర్వాహణలో ఏవిధంగా నడుచుకోవాలని, వృత్తిరిత్యా నైవుణ్యతపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. దీనితో పాటు ఆర్ముడ్ సిబ్బంది వివిధ కేసులలో నేరస్తులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేటప్పుడు ఏ,ఏ కేసులలో దోషులను సంకెళ్ళు వేయవచ్చు, విఐపి, వివిఐపి, సెక్యూరిటీ మరియు ఎస్కార్ట్ చేసేటప్పుడు పాటించవలసిన మెలకువలు తదితర అంశాలపై శిక్షణ తరగతులు అందించడం జరుగుతుంది అన్నారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారులు సిబ్బంది ప్రతి రోజులు వ్యాయామం చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని అన్నారు. ఈ 15-రోజుల మొబిలైజేషన్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డ్ లు ప్రకటించడం జరుగుతుందని అన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలి..జిల్లా ఎస్పీ గారు సూచించారు. ఈ మొబిలైజేషన్ కార్యక్రమంలో ఎఆర్ డియస్పీ నరేందర్, ఆర్ఐ లు రామరావ్, రాజశేఖర్ రెడ్డి, డానియోల్, శ్రీనివాస్ రావ్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments