Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
February 20, 2025 at 12:03 PM
జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 20-02-2025, • మృతురాలు ఆలియా బేగం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ గారు. • ఎలాంటి సమస్యలున్న నేరుగా నాతో మాట్లాడొచ్చు.. • భాదిత కుటుంబానికి అండగా ఉంటాం జిల్లా ఎస్పీ శ్రీ. చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్. గారు. ఈ రోజు తేది: 20.02.2025 నాడు మునిపల్లి మండలం, అంతారం గ్రామం నందు మృతురాలు ఆలియా బేగం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ గారు.. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. తేది: 11-02-2025 నాడు రాత్రి 7:30 గంటల సమయంలో మునిపల్లి మండలం, అంతారం గ్రామంలో మహ్మద్ ఇస్మాయిల్ మరియు కొల్లూరి వీరా రెడ్డి, విజయ్ రెడ్డిల మద్య జరిగిన గొడవలో విడిపించడానికి అడ్డుగా వెళ్ళిన ఇస్మాయిల్ కూతురు ఆలియా బేగం, వయస్సు: 15 సంవత్సరాలు ప్రమాదవశాత్తు గాయపడి, చికిత్స పొందుతూ తేది: 16.02.2025 నాడు మరణించడం జరిగింది. ఆమె అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని, ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని అన్నారు. మృతురాలు ఆలియా బేగంపైన వారికి ఎలాంటి కక్షలేదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించాలని ఎస్పీ గారు అన్నారు. ఇట్టి విషయమై ఎవరైనా సామాజిక మాద్యమాలలో రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు పెట్టిన, వ్యాక్యలు చేసిన అట్టి వ్యక్తులపై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విజిటింగ్ నందు ఎస్పీ గారి వెంబడి సంగారెడ్డి డియస్పీ సత్యయ్య గౌడ్, కొండాపూర్ ఇన్స్పెక్టర్ డి. వెంకటేష్, మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Comments