
Sangareddy District Police Updates
February 20, 2025 at 01:53 PM
జిల్లా పోలీసు కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన తేది: 20-02-2025,
• రాజీ మార్గమే.. రాజ మార్గం! రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు...
• మార్చ్ 8న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను విజయవంతం చేయండి..
• సైబర్ నేరాలలో హోల్డ్ చేయబడిన డబ్బు తిరిగి బాధితులకు అందే విధంగా చూడాలి.
• వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యస్.హెచ్.ఒ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ. చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్. గారు.
ఈ రోజు తేది: 20.02.2025 నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్ గారు మాట్లాడుతూ.. మార్చ్ 8న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అన్ని కేసులలో ఇరు వర్గాలు రాజీ పడేలా వారికి అవగాహన కల్పించాలని యస్.హెచ్.ఒ లకు సూచనలు చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు కోల్పోయిన/ హోల్డ్ చేయబడిన డబ్బు తిరిగి బాధితులకు చేరే విధంగా సంబంధిత బ్యాంక్ అధికారులకు కోర్టు ద్వారా ఉత్తర్వులు అందించాలని సూచించారు.
అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీ కుదుర్చకోవాలని అన్నారు.
ఈ కాన్ఫరెన్స్ నందు అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, యస్.బి ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.