" THATIPAMULA * FOUNDATION "
" THATIPAMULA * FOUNDATION "
February 28, 2025 at 04:15 AM
*ఆంజనేయస్వామి వారి "తోకకు" ఎందుకు నమస్కారం చేయాలి???...* ఆంజనేయస్వామి వారి "తోకకు" ఎందుకు నమస్కారం చేయాలంటే ఆయన రుద్ర వీర్య సంభవుడు. రుద్రాంశ సంభూతుడు. సాక్షాత్తు పరమేశ్వరుడే. పరమేశ్వర స్వరూపం అర్థనారీశ్వర తత్త్వంతో కూడుకొని ఉన్నది. "నశివేన వినా దేవి" అంటే "ఈశ్వరుడు" లేకుండా ఈశ్వరి ఉండదు. "దేవ్యాచ వినా శివః" శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండలేడు. కాబట్టి అర్థనారీశ్వర తత్త్వాన్ని అనుసరించి ఈశ్వరుడు ఆంజనేయస్వామిగా అవతరించినప్పుడు ఆ జగదంబ "పార్వతీ" దేవి ఆంజనేయ స్వామివారి యొక్క తోకలో తన శక్తిని నిక్షిప్తం చేసింది. అందుకే హనుమదుపాసకులు వాలపూజ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన సాధనా విశేషాలను కూడా అభివృద్ధి చేశారు. ఆంజనేయస్వామి వారి చిత్ర పటాలను సేకరించి ఆ చిత్రంలో తోకభాగానికి మాత్రమే 24 రోజులపాటు ప్రతిరోజూ ఒక్కొక్క బొట్టు పెడుతూ దానికి సంబంధించిన మహామంత్రం జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంటూ హనుమదుపాసకులు చెప్తారు. దీనికి హనుమత్ వాల పూజ అని పేరు. దీనిని ఒక నియమంతో , ఒక సంకల్పంతో, ఒక సాధనతో చేయవలసిన విశేష పరిశ్రమ. కనుక శక్తి ఆయన వాలంలో ఆశ్రయించి ఉంటుంది. వాలమునకూ, స్వామి వారికీ నమస్కరించాలి ... జై ఈశ్వరాంజనేయ ..🙏🌹

Comments