జై శ్రీరామ్ జై హనుమాన్
జై శ్రీరామ్ జై హనుమాన్
January 31, 2025 at 05:40 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/HXBwaSCHvai2kfyp7z4D8H 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 MAAGHA PURANAM -- 3 మాఘపురాణం - 3వ అధ్యాయము వింధ్య పర్వతము: వశిష్ఠుడు మరల ఈ విధముగా దిలీపునకు చెప్పా సాగెను. భూపాలా! నేను చెప్పే ఈ విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి చాలా నష్టము జరిగినది. అందువలన జనులు యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకొను మునీశ్వరులు సహితము ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస వెళ్ళిపోతున్నారు. భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు, పంటభూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు. మహాతపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరములనుండి ఆ ప్రాంతము నందు ఉండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసవెళ్ళి పోయాడు. హిమాలయ పర్వతములకు పడమటి దిక్కున కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఒక తెల్లని కొండచరియ ఉన్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థించారు. ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరిస్తు ఉంటారు” అని వివరించారు. దిలీపుడు వశిష్ఠునితో - “ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగ చేస్తున్నవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించాడు. వశిష్ఠులవారు “రాజా! నీ అభీష్టం ప్రకారమే వివరిస్తాను. సావధానుడవై ఆలకించు. “ ఆ పర్వతరాజము ఎంతో వింతయినది. దానిపైనున్న వింత చెట్లు, వన్య మృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతం ముప్పది యోజనముల పొడవు కలిగి, పది యోజనములు ఎత్తు కలిగి అలవారుచుండెను. ఆ ప్రాంతమునకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించి తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించుకుని ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతము మీదకి వచ్చి తపము చేసుకొనుచున్న భృగుమహర్షిని చూచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును చెప్పసాగాడు. గంధర్వ యువకుని వృత్తాంతము - “భృగుమహర్షీ! నా కష్టము ఏమని చెప్పను? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినది. కానీ నాకు పులి ముఖము కలిగినది. ఏ కారణము చేత అలా కలిగినదో బోధపడకున్నది. నా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. నా ఈ రూపమునకు కారణమును వివరించి నా మనోబాధను తొలగింప చేయమ” ని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము ఆలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని - “ఓ గంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడు కృంగదీయు విషయములు. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానము పరమ ఔషధము. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. నువ్వు నీ భార్యతో గూడ ఈ పర్వతము నుంచి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. ఇది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూరుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ తీరుతుంది. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు, ఆతని భార్య కూడా భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా విని మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై దగ్గరలో ప్రవహించుచున్న నదిలో స్నానం చేయగా వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందము పొంది వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసారు. భృగువు వారలను దీవించి పంపివేసాడు. ఈవిధముగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకు తెలియ చేసి “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతము? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన గొప్ప ఫలితములు కలుగును. *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్

Comments