Bharatha 360
                                
                            
                            
                    
                                
                                
                                February 3, 2025 at 05:20 PM
                               
                            
                        
                            *#todaystopnews*
#03.02.2025 *#bharathasudarshan*
•	మహిళల అండర్ – 19 టీ20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు గాను తెలంగాణ బిడ్డ ‘గొంగడి త్రిష’కు ఐసీసీ ప్రకటించిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ చోటు లభించింది.
•	రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించాం : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
•	హైదరాబాద్ లో స్కిల్ సెంటర్ ఏర్పాటు ఆలోచన ఉందా? అని లోక్ సభలో ప్రశ్నించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
•	తెలంగాణలోని 19 జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల నియామకం.
•	తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంకండి..పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
•	ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ దే విజయమన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
•	ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణను ఫిబ్రవరి 10వ తేదికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
•	బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష’ పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగిన నిరసనలు
•	తెలంగాణలో 90 శాతం జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు : లోకసభలో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
•	సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లకి అందజేసింది.
•	బీసీల కుల గణనపై రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు.
•	తెలంగాణలో ఈఏపీ సెట్, పీజీఈ సెట్ షెడ్యూల్ ని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 
•	చరిత్రలో తొలిసారిగా డాలర్ తో పోలిస్తే భారత్ రూపాయి రూ.87కి పైగా పడిపోయి ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది.
•	ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంటే హైదరాబాద్ గుర్తకువచ్చేలా 200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏఐ వర్సిటీ నిర్మంచబోతున్నాం : మంత్రి డి.శ్రీధర్ బాబు
•	రిటైర్ అవబోతున్న సీఈసీ కి బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందోనని ప్రశ్నించిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. ఈసీ పనితీరుపై ఆగ్రహం
•	ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనున్నది
•	పని గంటలపై వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదన్న కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే
•	ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు..నగదు ఆధారిత పథకాలపై అత్యవసర విచారణ జరపాలన్న పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
•	ఫిబ్రవరి 13న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం
•	ఏపీని ఆర్థికంగా గట్టెక్కించే చర్యలకు సహకరించాలని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియా ను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
•	అందరికీ ఒకే రకమైన టోల్ ఉండేలా కొత్త పాలసీని కేంద్రం తీసుకురానుంది : కేంద్ర మంత్రి గడ్కరీ