
Bharatha 360
62 subscribers
About Bharatha 360
*'Bharatha Sudarshan Sir'* is a *Socio, Political Analyst, Educationist, Motivator, Senior Journalist & an Eminent Faculty* for Civils and other Competitive Exams *(UPSC, TSPSC, APPSC* and Other Exams). This *Channel* is useful for all to know *"The Breaking, Updated NEWS Analysis & current affairs"*. *'భారత సుదర్శన్ సర్'*.. "సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, విద్యావేత్త, మోటివేటర్, సీనియర్ జర్నలిస్ట్ & ప్రముఖ ఫ్యాకల్టీ" (సివిల్స్, UPSC, TSPSC, APPSC & ఇతర పోటీ పరీక్షలకు) . ఈ *ఛానల్* *"బ్రేకింగ్, అప్‌డేట్ న్యూస్ అనాలిసిస్ & కరెంట్ అఫైర్స్"* తెలుసుకోవడం కోసం అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా *చేరండి!..చేర్పించండి!!*
Similar Channels
Swipe to see more
Posts

#TelanganaFormationDay ప్రపంచ ప్రభంజనంలో తెలంగాణ ఆత్మగౌరవ పతాకం!.. జన ఉద్యమాల్లో కొదమ సింహాలై.. జన మాధ్యమాల్లో విప్లవ కవనాలై.. ప్రజా క్షేత్రంలో ప్రళయ ప్రభంజనమై.. ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయమై.. నిలిచిన లిఖించిన సృష్టించిన తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన భూమిపుత్రులకు... "తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు".. 💐 - భారత సుదర్శన్ తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్, సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణ కోసమే.. తెలంగాణ జర్నలిస్టులు! 'తెలంగాణ జర్నలిస్టుల ఫోరం' ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జల విహార్ లో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. 'తెలంగాణ జర్నలిస్టుల ఫోరం'తో నాది సుదీర్ఘ అనుబంధం..భావోద్వేగాలు, మంచి చెడులు చాలా ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కుటుంబ నేపథ్యంలోంచి వచ్చినవాడిగా.. నా కెరీర్ ను సైతం త్యాగం చేసి క్రియాశీల ఉద్యమ సంస్థల్లో , మరింత క్రియాశీలకంగా పనిచేసినందుకు గర్వంగానూ ఉంది. ఏ ఉద్యమమైనా.. ఏ సంస్థయైనా ఎక్కడో ఒకచోట మొదలు కావాల్సినదే. 'తెలంగాణ జర్నలిస్టుల ఫోరం'ను తెలంగాణ ప్రజలు బలంగా నమ్మారు. దానివెనుక అనేక మంది ఉద్యమ జర్నలిస్టులు, మేధావుల కఠోర శ్రమ ఉన్నది. ఒకానొక దశలో తెలంగాణ ఉద్యమంలో చాలామంది నెత్తిమీద తడిబట్ట ఏసుకొని కూర్చున్నా కూడా తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమించారు. అన్ని సంస్థలకు భిన్నంగా తెలంగాణ ఉద్యమంలో 'తెలంగాణ జర్నలిస్టుల ఫోరం' ఎంతో ఉన్నతమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించింది. 25 ఏండ్ల 'తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్' ఉద్యమంలో మమేకమై జీవితాలను త్యాగం చేసిన ఉద్యమ జర్నలిస్టులందరికీ పేరుపేరునా వందనాలు. ఆ బాధ్యతల్లో.. ఆ ఉద్యమాల్లో.. నేను సైతం పాలుపంచుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఉద్యమ వారసత్వాన్ని జీవితాంతం కొనసాగిస్తాను.. తెలంగాణ మాతృభూమికి ఎనలేని సేవ చేస్తాను.. జై తెలంగాణ! - భారత సుదర్శన్, తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ #తెలంగాణజర్నలిస్టులఫోరమ్ #telanganajournalistsforum #BharathaSudarshan #telanganajournalist #TelanganaMovement #fbviral #trendingpost #socialmedia
