
Bharatha Sudarshan Sir
February 8, 2025 at 11:52 AM
*'కేజ్రీవాల్'ను ఓడించిన*
*'పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ' ఎవరు?*
* ఢిల్లీ మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి సాహిబ్ సింగ్ వర్మ. సాహిబ్ కౌర్ దంపతుల కుమారుడు.
* ఆధిపత్య 'జాట్'కు చెందిన రాజకీయ నాయకుడు
* 7 నవంబర్, 1977న (47 ఏండ్లు) ఢిల్లీలో జన్మించారు.
* భార్య స్వాతి సింగ్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.
* ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కిరోర్ మాల్ కాలేజీల్లో, మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. (BA), ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎం.బి.ఎ. (MBA) విద్యనభ్యసించారు.
* ఢిల్లీ పశ్చిమ లోక్ సభ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నాడు.
* గతంలో ఎంపిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలు పార్లమెంట్ కమిటీల్లో పనిచేశారు.
* ఢిల్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో లోక్ సభ ఎంపీ (2019) గా గెలుపొందారు.
* ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేజ్రీవాల్ ను ఓడించి 'గేమ్ చేంజర్'గా నిలిచాడు.
*సీఎం కావడానికి ప్రధాన అర్హతలు:* ఆర్ఎస్ఎస్ కుటుంబ నేపథ్యం, బీజేపీ మాజీ సీఎం కుమారుడు, ప్రముఖ జాట్ నాయకుడు, ఢిల్లీ చరిత్రలోనే ఎంపీ గా అత్యధిక మెజార్టీతో గెలుపు, విద్యాధికుడు, పాలనా అనుభవం, భార్య తండ్రి కూడా మధ్య ప్రదేశ్ బీజేపీ అగ్రనేత, మరో అంకుల్ పశ్చిమ ఢిల్లీ మేయర్, అన్నింటికీ మించి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం, ప్రధాని మోదీని బలంగా ఎదిరించిన నాయకుడు 'అరవింద్ కేజ్రీవాల్' పై గెలుపొందడం.
*#bharathasudarshan* #seniorjournalist