Bharatha Sudarshan Sir
Bharatha Sudarshan Sir
February 10, 2025 at 12:54 AM
*#morningnews* #10.02.2025 *#bharathasudarshan* • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 10న కుంభమేళా పర్యటన ఖరారు. • వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని పెకిలించివేస్తాం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. • మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. జాతుల మధ్య వైరంతో రెండేళ్లుగా మణిపూర్ రగలిపోతోంది. ప్రభుత్వం విఫలం కావడం, హింసను ప్రేరేపించడంలో సీఎం హస్తం ఉందనే ఆరోపణలు రావడం, కుకీ సంబంధిత సంస్థ సుప్రీకోర్టు దృష్టికి తీసుకెళ్లడం, ఫోరెన్సిక్ నివేదకను అందించాలని సుప్రీం ఆదేశించడం రాజీనామాకు కారణాలని భావిస్తున్నారు. • దేశ చరిత్రలో తొలిసారిగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోంది : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ • జాతీయ విద్యావిధానాన్ని, త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించినందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం బహిరంగ బెదిరింపులకు పాల్పడుతోంది : తమిళనాడు సీం ఎం.కె.స్టాలిన్ • ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్ ఎమ్మెల్యేలు ప్రజల కోసం పనిచేయాలి : ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. • భారత్ - ఇంగ్లాండ్ రెండో వన్డేలో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం.. సిరీస్ కైవసం.. రోహిత్ సెంచరీ • సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ – 2025 దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఫిబ్రవరి 18 వరకు పొడిగించిన యూపీఎస్సీ. • ఉక్రెయిన్ తో యుద్ధంలో అమాయక ప్రజలు చనిపోవడం ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుకుంటున్నారు : డొనాల్డ్ ట్రంప్ • ‘ఛాంపియన్స్ ట్రోపీ’లో పాకిస్థాన్ జట్టు కప్ గెలిస్తే మాత్రమే సరిపోదు..చిరకాల ప్రత్యర్థి భారత్ ను కూడా ఓడించాలి : పాక్ ప్రధాని షెష్ బాజ్ ఫరీఫ్. • బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మద్ధతుదారులపై ‘ఆపరేషన్ డెవిల్స్ హంట్’ పేరిట దాడులు చేస్తున్న యూనస్ సర్కార్. • ఉత్తర కొరియాలో ప్రత్యర్థులను భయపెట్టే అన్ని రకాల అత్యాధునిక అణ్వాయుధాలను తయారీకి కట్టుబడి ఉన్నాం : అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ • ‘టిక్ టాక్’ ను కొనుగోలు చేసే ఆలోచన నాకు లేదు : ఎలాన్ మస్క్ • అమెరికాలో ఈ సీజన్ లో 2.4 కోట్ల మంది ఫ్లూ వైరస్ బారిన పడగా, 3.1 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. 13 వేల మంది చనిపోయారు : సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ *బీసీ కుల గణన యుద్ధం :* • కుల గణనలో ఐదున్నర శాతం జనాభాను తగ్గించారు. దాదాపు 22 లక్షల మంది ఉన్నవారిని లేనట్లుగా చిత్రీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలి. రీ సర్వే చేసి సరైన లెక్కలు తేల్చాలి : కేటీఆర్ • కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పుల తడక అనడం సరికాదు : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ • తప్పుల తడకగా కుల గణన రిపోర్ట్.. ముస్లీంలను బీసీల్లో ఎలా కలుపుతారు : కేంద్ర మంత్రి బండి సంజయ్ • కుల గణనలో తమ సామాజిక వర్గం జనాభాను తక్కువ చేసి చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కుట్రకోణమే : మున్నూరుకాపుల సమావేశంలో బండి, వద్దిరాజు, డాక్టర్ లక్ష్మణ్, గంగుల, తీన్మార్ తదితరులు • మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ అన్యాయం చేసిందనేది అబద్ధం : సీఎం రేవంత్ రెడ్డి • తెలంగాణలో రియల్ డిజాస్టర్ కు సీఎం రేవంతే కారణం : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు • ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు..హైదరాబాద్ లో బీజేపీ సంబరాలు. • ఢిల్లీ సీఎం అతిశీ రాజీనామా • కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత • స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : మంత్రి సీతక్క • మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు • హయత్ నగర్ కోహెడ్ లో ఒక రియల్టర్ అక్రమ నిర్మాణాలను కూల్చిన ‘హైడ్రా’. • ఫిబ్రవరి 15 తో ముగియనున్న నుమాయిష్. • చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై జరిగిన దాడిపై పోలీసులు కేసు నమోదు. *For "Breaking News, News Analysis, Job & Education News"..* follow *'Bharatha Sudarshan Sir'* WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Va4g41DHrDZbymJWDg3J

Comments