
Bharatha 360
February 20, 2025 at 03:19 AM
తెలంగాణ భగత్ సింగ్,
సిరిపురం యాదయ్య యాదిలో..
తాను అనాథయై
అనాథలకు ఆద్యుడై
అందరికీ ఆమోదుడై
పద్మశాలీల పౌరుషమై
తెలంగాణ ఉద్యమయోధుడై
అమరవీరుల దీపకళికలా..
ప్రతి ఇంటి కంటి వెలుగులా..
చరిత్రలో చిరస్థాయిగా
మా గుండెల్లో చిరంజీవిగా
నీ స్థానమెప్పుడూ పదిలమే!
యాదన్నా!
నీ మరణం వృథా కాలేదు..కాబోదు..
నీ వెలకట్టలేని త్యాగానికి
వేలవేల జోహార్లు!!
జై తెలంగాణ!
జై భారత్!!
@యోధ
భారత సుదర్శన్
* తెలంగాణ అమరవీరుడు 'సిరిపురం యాదయ్య యాదిలో' మొదటిసారిగా నేను రాష్ట్రవ్యాప్తంగా ఆనాడు వేయించిన పోస్టర్..*