
APPSC TELEGRAMME GROUP
February 10, 2025 at 11:10 AM
వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు ...
నేటి నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశం - వాట్సప్ నంబరు 9552300009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు...
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి...
@ ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్‌కి హాయ్ (Hi) అనే వాట్సప్‌లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది
@ దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి.
అందులో విద్య సేవలుపై క్లిక్ చేయాలి.
@ అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయగానే, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది.
@ దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే ఎంతో సింపుల్‌గా డౌన్లోడ్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడిట్ పరీక్షలు ...
-మార్చి 1వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు,
-మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
-ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
👍
1