T News
T News
February 19, 2025 at 10:27 AM
*బీఆర్ఎస్ లో చేరిన పలువురు కాంగ్రెస్ నేతలు* *కాంగ్రెస్ పాలనపై విరక్తిచెందే పార్టీ మారుతున్నామంటున్న నేతలు* *గులాబి కండువాలుగప్పి పార్టీలో స్వాగతం పలికిన గిరిజన నేత దశరథ్ నాయక్* రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని గోవిందాయి పల్లి తండా గ్రామపంచాయతీ నుండి పలువురు యువ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ యువకులను కడ్తాల్ మాజీ జెడ్పిటిసి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్ కండువా కప్పి పార్టీలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలన నచ్చక బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో కేతావత్ గణేష్, పాత్లావత్ జైపాల్, కెతావత్ గోపాల్, సభావత్ మునిందర్, సభావాత్ దశరథ్, సభావత్ నరి, సభావర్ మల్లేష్ లను స్థానిక నాయకులతో కలిసి పార్టీలో స్వాగతం పలికారు.
👍 1

Comments