PALLA RAJESHWAR REDDY
February 23, 2025 at 05:04 PM
*నిరుపేద ఆడబిడ్డ వివాహానికి ఎమ్మెల్యే పల్లా కానుక అందజేత*
*బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ నాయకుల సమాచారం మేరకు పేదింటి ఆడబిడ్డకు చేయూత*
*జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి*
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో తల్లిదండ్రులు లేని నిరుపేద ఆడబిడ్డ వివాహానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో అల్వాల మధు కరుణ కొన్ని సంవత్సరాల క్రితం మృతిచెందగా తల్లిదండ్రులు లేని ఆడబిడ్డ వివాహానికి సహాయం కావాలని బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి సమాచారం తెలియజేయగా వెంటనే 5000 రూపాయలు ఆడబిడ్డ వివాహానికి కానుకగా అందించారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి పలువురు నాయకులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రాజకుమార్ ఆర్
సోషల్ మీడియా ఇంచార్జి