PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
February 26, 2025 at 07:17 AM
జనగామ నియోజకవర్గం తేది :(26-2-2025) శంభో..మహా శివ శంభో -భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి వేడుకలు -చీటకోడూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో మార్మోగిన శివనామస్మరణ -ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా.పల్లా గారు జనగామ: జనగామ మండలం చీటకోడూరు గ్రామంలో బుధవారం శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ పంచకోసు రామ లింగేశ్వర స్వామి ఆలయంలో శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్బంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం శివాలయంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా గారు మాట్లాడుతూ... ✅ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంకు మహాశివరాత్రి సందర్బంగా అనేకమంది భక్తులు ఇక్కడికి వస్తారు. ✅జనగామ నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ✅అనేక మంది కోరికలు తీర్చే రామలింగేశ్వర స్వామి గారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ✅మహా శివరాత్రి సందర్బంగా ప్రతి ఏడాది నేను మొదటగా ఈ దేవాలయంకు వచ్చి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ✅ఇక్కడ సదుపాయాలు కూడా కొద్దీగా మెరుగు పర్చుకోవాల్సి ఉంది. కచ్చితంగా వాటికి సంబందించిన అభివృద్ధి పనులకు కృషి చేస్తాను. ✅అద్భుతంగా వేడుకలు నిర్వహిస్తున్న దేవాలయ కమిటీకి నేను ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నా.. ✅అనంతరం ప్రజలందరూ సు:ఖ సంతోషాలతో సిరి సంపదలతో వెలసిల్లలాని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటున్నా.

Comments