Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                May 29, 2025 at 02:59 PM
                               
                            
                        
                            మెగా డీఎస్సి కాదు.. దగా డీఎస్సి! 
* నార్మలైజేషన్ తొలగించి, జిల్లాకో పేపర్ ఇవ్వాలి..  
* అయిదున్నర లక్షల అభ్యర్థులకు అన్యాయం.. 
* నిర్ణయం మార్చుకోకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాం.. 
* బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటన.. 
మెగా డీఎస్సి పేరిట అయిదున్నర లక్షల మంది జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఒక ప్రక్రియ, ఒక విధానం, ఒక స్పష్టత లేకుండా.. అభ్యర్థులకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.. ప్రభుత్వం వెంటనే మేల్కొని.. అత్యున్నత స్థాయిలో నిర్ణయం సమీక్ష చేసి, అభ్యర్థులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే లక్షలాది మందితో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.. ఈరోజు ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆయన ప్రభుత్వం ముందు కొన్ని స్పష్టమైన/ అభ్యర్థులకు న్యాయపరమైన డిమాండ్లు ఉంచారు..  
* డీఎస్సి పరీక్షను 90 రోజులు వాయిదా వేయాలి.. అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోడానికి వివిధ ధ్రువీకరణ పత్రాలు అందించి, అంతా సిద్ధమయ్యే సరికి పది రోజులు వృథా పోయింది.. ఇంత ఒత్తిడి మధ్య వాళ్ళు సరిగా రాయలేరు, కాబట్టి పరీక్షను 90 రోజులు వాయిదా వేయాలి.. 
* నార్మలైజేషన్ పద్ధతిని రద్దు చేసి, ఒక జిల్లాకు ఒకేసారి, ఒకే విధమైన పేపర్ (ప్రశ్నపత్రం)తో పరీక్ష నిర్వహించాలి.. 
* అభ్యర్థులకు వయో పరిమితి పెంచాలి.. తెలంగాణ రాష్ట్రంలో 47 ఏళ్ళు ఉంది.. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే వయసుని అర్హతగా నిర్ణయించాలి.. గడిచిన ఏడేళ్లుగా డీఎస్సి లేదు.. అంటే లక్షలాది మంది అభ్యర్థులు వయసు ధాటి, అనర్హులయ్యారు.. ప్రభుత్వం చేసిన తప్పులకు అభ్యర్థులు ఎందుకు బలవ్వాలి..? 
* రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి.. రెండు ప్రభుత్వాల తప్పులకు, ఈ నిబంధనలకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే బీసీవై పార్టీ చూస్తూ ఊరుకోదు, అభ్యర్థులకు సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే అభ్యర్థులతో కలిసి ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు..!!
                        
                    
                    
                    
                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            😮
                                        
                                    
                                    
                                        5