
YSR Congress Party
June 7, 2025 at 02:05 PM
-సిండికేట్‌గా మారిన పొగాకు కంపెనీలు
రాష్ట్రంలో పొగాకు సాగు చేసిన రైతులు కొనుగోలు చేసే వారు లేక అల్లాడిపోతున్నారు. బర్లీ పొగాకును ప్రోత్సహించిన పలు కంపెనీలు తరువాత ఆ పొగాకును కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రెండుమూడు బేళ్ళు కొనుగోలు చేసి, మిగిలిన దానిని వదిలిస్తుండటంతో రైతులు అన్యాయమైపోతున్నారు. మొత్తం ఏడు కంపెనీలు సిండికేట్‌గా మారి రేటు పెరగకుండా రైతులను దగా చేస్తున్నాయి. ఈరోజు రైతుల వద్ద మొత్తం 55 మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వలు ఉంటే, ఇప్పటి వరకు కేవలం 25 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోళ్ళు చేశారు. మిగిలిన పొగాకును దాచుకునేందుకు కూడా అవకాశం లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టిన వారికి కనీసం పెట్టిన వ్యయం కూడా గిట్టుబాటు కావడం లేదు. తక్షణం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి పొగాకు కొనుగోళ్ళు జరిపించాలి. గతంలో వైయస్ జగన్ పాలనలో పొగాకు రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటే ఏకంగా రూ.100 కోట్లు కేటాయించి కొనుగోళ్ళు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఈక్రాప్, ఇన్సూరెన్స్ కట్టించి, రైతులకు అండగా నిలిచారు. గతంలో ఒంగోలులో కందులు పండకపోతే ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.12000 పరిహారం అందింది.
#ysrcpforfarmers
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😮
10