
YSR Congress Party
June 8, 2025 at 11:30 AM
మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రకు సంఘీభావం తెలియజేసిన నాయకులు
RDT స్వచ్ఛంద సంస్థకు FCRA రెన్యూవల్ డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య చేపట్టిన "RDT పరిరక్షణ పాదయాత్ర" కు ఎమ్మెల్సీలు వై శివరామిరెడ్డి, మంగమ్మ, వైసీపీ ముఖ్య నాయకులు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, చవ్వా రాజశేఖర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, నాగేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలియజేసి పాదయాత్రలో పాల్గొన్నారు
తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్ర ఐదో రోజు బచ్చేహళ్లి నుండి ప్రారంభమై కైరేవు గ్రామానికి చేరుకుంది
ఈ సందర్భంగా కైరేవు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో YSRCP నాయకులు మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా వరప్రదాయని RDT స్వచ్ఛంద సంస్థకు FCRA రెన్యూవల్ చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
RDT సంస్థ కోసం తలారి రంగయ్య పాదయాత్ర చేయడం గొప్ప విషయమని, పేద ప్రజల పట్ల, కళ్యాణదుర్గం ప్రాంతం పట్ల తలారి రంగయ్యకు చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని YSRCP నేతలు కొనియాడారు
FCRA రెన్యూవల్ చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కన్వీనర్లు ఎంపీపీలు జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు RDT లబ్ధిదారులు మహిళా సంఘాల సభ్యులు రైతులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
#saverdt
❤️
👍
8