
YSR Congress Party
June 8, 2025 at 12:43 PM
గతంలో అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లలో, పబ్లిక్ మీటింగుల్లో కూర్చుని టీడీపీ సీనియర్ నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ5, ఏబీయన్ ఛానెళ్ల ముందు ఎందుకు ధర్నాలు నిర్వహించలేదు? ఆ పత్రికల ప్రతులను ఎందుకు తగలబెట్టలేదు? టీడీపీ నాయకులు మాట్లాడిన సందర్భాల్లో వారి మనోభావాలు దెబ్బతినలేదా? టీడీపీ నాయకులు, కిర్రాక్ ఆర్పీ, సీమ రాజా, చేబ్రోలు కిరణ్ మాట్లాడిన వీడియోలను కూడా ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాము. సాక్షాత్తు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత వైయస్ కుటుంబం గురించి, వారి ఇంటి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా వారి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. నాడు సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి పదే పదే సైకో అని మాట్లాడిందే చంద్రబాబు. వైయస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాన్ నా కొడకల్లారా అని రెచ్చిపోయాడు. వారిద్దరి మీద కూడా ఎందుకు కేసులు పెట్టలేదు?
-పోతిన మహేష్ గారు, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు
#tdpfakenewsfactory
#savewomenfromtdp
#tdpabuseswomen
👍
❤️
🙏
13