YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 8, 2025 at 02:37 PM
>టీచర్లను ఎలా మోసం చేశారంటే... టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్‌లు పెట్టి మ్యానువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేస్తానని చెప్పి నమ్మించారు. తరువాత అసెంబ్లీలో మాత్రం మ్యాన్‌వల్‌కు బదులు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్ చేస్తామని చట్టం తీసుకువచ్చారు. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు చట్టంలో ఉన్న దానిని పక్కకుపెట్టి మ్యాన్‌వల్‌ బదిలీలనే చేస్తామని హామీ ఇచ్చారు. గత మే నెలలో ఆన్‌లైన్‌ బదలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండటంతో డీఈఓ కార్యాలయాల ముందు మే 25న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనితో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీచర్ యూనియన్లతో ఒక మీటింగ్ పెట్టి చట్టప్రకారం ఆన్‌లైన్ బదిలీలు ఉన్నా కూడా, దానిని పక్కకు పెట్టి మ్యానువల్ బదిలీలే చేస్తామని హామీ ఇవ్వడంతో టీచర్ యూనియన్లు ఆందోళనను విరమించుకున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం మే 25న బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీఓ 22లో ఖచ్చితంగా ఆన్‌లైన్ బదిలీలే చేస్తామని స్పష్టం చేసింది. ఇంతకంటే మోసం ఎక్కడైనా ఉంటుందా? దీనిపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొరపాటుగా ఆ జీఓ జారీ చేశామని, మ్యానువల్ బదిలీలే చేస్తామంటూ టీచర్ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు హటాత్తుగా బదిలీలపై తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా పదేపదే టీచర్లను నమ్మించి, నిలువుగా దగా చేస్తూనే ఉన్నారు. -ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు #cbncheatedgovtemployees #1yearforcbnbackstabbing #mosagadubabu #seizetheliarpk
❤️ 👍 🙏 10

Comments