
YSR Congress Party
June 8, 2025 at 02:50 PM
-బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తం
గత ప్రభుత్వం జారీ చేసిన 117 జీఓను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూల్స్‌ను తీసుకువచ్చింది. బదిలీల కోసం వెబ్ అప్షన్స్‌లో ఫౌండేషన్, బేసిక్, మెడల్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అనే నాలుగు ఆప్షన్స్ కనిపించాల్సి ఉంది. కానీ కేవలం ఎంపీపీ, యుపీ స్కూల్స్ అని మాత్రమే పెట్టారు. దీనితో టీచర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము ఆప్షన్ ఇచ్చే స్కూల్ ఏ కేటగిరిలోకి మార్పు చెందిందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రేపు సాయంత్రంతో వెబ్ అప్షన్స్ గడువు ముగుస్తోంది. తొమ్మిదిరకాల స్కూల్స్‌గా మార్చిన నేపథ్యంలో కొన్ని మండలాల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా పెడితే, మరికొన్ని మండలాల్లో ఫౌండేషన్ స్కూల్స్‌ను ఎక్కువగా పెట్టారు. ఎక్కడా హేతుబద్దత అనేది లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా స్కూల్స్ కేటగిరిని మార్చారు. ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓలతో సంబంధం లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ఏ స్కూల్ ఏ కేటగిరిలో ఉండాలని నిర్ణయించకుండా, టీడీపీ నాయకులు సూచించినట్లుగా స్కూల్స్‌ను మార్చేశారు. టీచర్లు ఎన్ని సంవత్సరాలు, ఎంత దూరంలో పనిచేశారనే దానిపై పాయింట్స్ ఇస్తారు. దాని ప్రకారమే బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ పాయింట్స్ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూపి టీచర్లను భయపెట్టాలని అనుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్ళతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. ఎనిమిది అకడమిక్ ఇయర్స్ పూర్తయితే బదిలీ చేస్తామనే నిబంధనలు ఉంటే, ఎనిమిది క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదంటూ సాకులు చూపి పాయింట్స్ ఇవ్వడం లేదు. అలాగే దాదాపు 4000 మంది స్కూల్ అసిస్టెంట్‌లు సర్‌ప్లస్‌గా మారిపోయారు. వారిని నిబంధనలకు విరుద్దంగా ప్రైమరీ స్కూల్‌కు కేటాయిస్తున్నారు. ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్న స్కూల్ అసిస్టెంట్‌ను కూడా పీఎస్ హెచ్‌ఎంగా మోడల్ స్కూల్స్‌కు పంపడం దారుణం. దీనివల్ల ఎస్‌జీటీలకు పీఎస్ హెచ్‌ఎం పదోన్నతి రాకుండా పోయింది.
-ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు
#cbncheatedgovtemployees
#1yearforcbnbackstabbing
#mosagadubabu
#seizetheliarpk
❤️
👍
🙏
7