
YSR Congress Party
June 8, 2025 at 03:29 PM
-పదో తరగతి మూల్యాంకనంతో పరువు పోయింది
మంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చూసిన నిర్లక్ష్యంతో విద్యాశాఖ పరువు పోయింది. పదోతరగతి పరీక్షలు విద్యార్ధుల భవిష్యత్తుకు తొలి మెట్టు. అటువంటి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలుసు. నెల్లూరుకు చెందిన విద్యార్థిని సాయి కుందనకి అన్ని సబ్జెక్ట్‌ల్లో తొంబైకి పైగా మార్కులు వస్తే, హిందీ సబ్జెక్ట్‌లో 34 మార్కులు వచ్చాయి, బాలికను ఫెయిల్ చేశారు. ఆమె రీవాల్యుయేషన్ పెట్టకుంటే 90 మార్కులు వచ్చాయి. నెల రోజుల పాటు ఆ విద్యార్ధి ఎంత వేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవాలి. బొర్రా శిశింద్రారెడ్డికి గణితంలో 32 మార్కులు వేశారు. అన్నింటిలో మంచి మార్కులు వచ్చిన ఈ విద్యార్ధి తిరిగి రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 72 మార్కులు వేశారు. దీనిపైన మళ్ళీ రీకౌంటింగ్ చేయించుకుంటే 78 మార్కులు వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన గంగిరెడ్డి మోక్షితను సోషల్ లో 21 మార్కులతో ఫెయిల్ చేశారు. రీవాల్యుయేషన్‌లో 84 మార్కులు వచ్చాయి. ఇలా అనేక మంది విద్యార్ధుల జవాబుపత్రాలను తీసుకువస్తే, ఎంత దారుణంగా వాల్యుయేషన్ చేశారో అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్‌ను దిద్దడానికి పదిరోజులు సమయం ఇచ్చే పరిస్థితి ఉంటే, ఆరు రోజుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు.
-ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు
#1yearforcbnbackstabbing
#mosagadubabu
#seizetheliarpk
❤️
👍
😂
😮
10