
Kazipet Swetharka Ganapati Temple
June 4, 2025 at 05:04 PM
*దశపాపహర దశమి*
*జూన్ 05 గురువారం దశపాపహర దశమి సందర్భంగా...*
గంగ పుట్టిన రోజే దశపాపహర దశను, దీనినే దశహార అని కూడా పిలుస్తారు. మనలోని సకల కల్మషాలనూ గంగ కడిగివేయగలదని చెబుతారు. అలా గంగ కడిగివేసే పదిరకాలైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఉద్దేశించినదే గంగాదశమి. మన పండుగలకు ఉన్న, నేపథ్యం చాలా లోతైనది. పండుగలకు పెట్టిన పేర్లలో దాగి ఉండే వ్యాకరణ రూపమైన అర్ధాన్ని సజావుగా తెలుసుకుంటే మన కర్తవ్యం ఏమిటో చక్కగా బోధపడుతుంది.
పదిరకాల పాపాలను పోగొట్టే దశమి పఠిరకాల దశ పేరు. అందరి నోళ్లలోనూ పాపం అన్న శబ్దం తరచుగా తిరుగుతూనే ఉంటుంది. కానీ అసలు 'పాప' అనే శబ్దాన్ని మాత్రం ఎవ్వరూ తరచి చూడరు. దాని అర్థమేమిటో ముందుగా తెలుసుకోవాలి.
పాతి - రక్షితి - ఆత్మానమితి పాపం... తనను తాను ఏదోవిధంగా రక్షించుకోవడానికి చేసే దుష్టకర్మే పాపం అంటే. 'పా' ధాతువుకు రక్షణమని అర్థం. అట్టి రక్షణకోసం ధర్మాన్ని దూరం చేయడం అనే అపాదాన అర్థంలో 'ప'వర్ణం చేరి పాపం అవుతోంది. ఈవేళ ఈపని పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ జరుగుతూనే ఉంది. సామాన్యుని నుంచి అమాత్యులవరకు అందరూ చేస్తూనే ఉన్నారు.
పిబతి పాపిష్ఠమితి పాపం... పాపిష్టివాణ్ణి అనుసరిస్తూ, వాడు చేసే దుష్కర్మల్ని ఎవడైతే సమర్థిస్తూ ఉంటాడో అది పాపం. ('పా'పానే అని ధాతురూపం... అంటే సమర్థన ద్వారా దుష్కర్మలు చేసేవాడి పాపాన్ని తాగడం అని అర్థం) ఇక్కడ కూడా 'పా' ధాతువుకి 'ప'వర్ణం చేరి పాపం అవుతోంది. అనగా రాజు పాపి అయితే అతని ఆజ్ఞను శిరసావహిస్తూ ఆచరించేవాడు ఎంతమంచి వాడైనా దుష్కర్మకి సహకరిస్తున్నాడు కనుక, ఆ కృత్యం పాపమే అవుతుంది.
పతతి నరకే అస్మాదితి పాపం... మనం చేసే ఏ పని వల్ల నరకలోకంలో శిక్ష అనుభవించడానికి పడవలసి వస్తుందో అది పాపం అవుతోంది. ఇవి ముఖ్యంగా పాపశబ్దానికి నిర్వచనాలు.
ఇట్టిపాపాలు స్థాయిని బట్టి మహాపాపాలనీ, పంచమహా పాపాలనీ కూడా వర్గీకరించారు. జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అట్టిపాపాల్లో పదిరకాల పాపాలు ఆరోజున శాస్త్రీయంగా వ్రతాచరణ చేసినవారు పోగొట్టుకోలుగుతారు. నిజానికి ఇటువంటి పదిరకాల పాపాలను హరింపచేసుకోవడానికి మరికొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా దశమి తిథి దీనికి ప్రత్యేకించినది.
హరతే దశపాపాని స్మాద్దశహరాస్మృతా... అన్న ఒక కారిక (సంస్కృత భాషలోని మూలగ్రంథాలకు రచించే వ్యాఖ్యానాలను కారికలు అంటారు.) జ్యేష్టశుద్ధ దశమికి దశహర అనేపేరును సూచిస్తోంది. అంతేకాదు హస్తానక్షత్రంతో వచ్చే బుధవారం, వ్యతీపాతయోగం కలరోజున కన్యారాశిలోకి చంద్రుడు, వృషభరాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజుల్లో కూడా పదిరకాలైన పాపాలు పోతాయని చెబుతారు. ఇలా ధర్మశాస్త్రం మన పాపాలను సులభంగా పోగొట్టుకునే మార్గాలను చెబుతున్నాయి.
సాధారణంగా అధికమాసాల్లోని తిథుల్లో పుణ్యవ్రతాలు లెక్కలోకి రావు. కానీ జ్యేష్టం అధికమాసమైనా అందులోని శుక్ల దశమి కూడా పదిపాపాలు పోగొట్టే శక్తి ఉంటుంది. కనుక ఆరోజు కూడా వ్రతాచరణ చెయ్యాలని ధర్మసింధువు చెబుతోంది. అయితే ఎలా చేయాలి ఈ వ్రతమన్న విషయంలో మొట్టమొదట స్నానము, సంకల్పంతోనూ ఈ వ్రతం ప్రారంభమవుతుందన్నారు పెద్దలు. ఒక నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ ఎవరికి ఏది సమీపంలో ఉంటే ఆ జలరాశిలో సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి.
దశమి తిథినాడు గంగాదేవి భూలోకానికి అవతరించిందని పెద్దలంటారు. ధర్మసింధు మొదలైన గ్రంధాల్లో వ్యష్ఠ శుద్ధ ద్వాదశి నాడు అవతరించిందని చెప్పాయి. కనుక క్రిష్ణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి తిరు మూడురోజులూ గంగా ప్రాశస్త్యం కలిగినవే. దశమినాడు దశహర దశమిగా పరిగణించి. కాశీలోని దశాశ్వమేద గంగాతీరంలో ఆరోజు స్నానం చేయడం శ్రేష్ఠంగా పరిగణించారు.
ముమైత్ జన్మజన్మాంతర సముద్భూత త్రివిధ ఛాయిన చతుర్వేద వాచక, త్రివిధ మానసిక రూపస్కాందోక్త దశవిధ పాపనిరాస త్రయస్త్రింశత్ ఛతపిత్రుదార బ్రహ్మలోక జదాని న్వేష్ట శుక్ల దశమే మనసిద్ధ్యర్థం దశం పహర (గంగానదీ) స్వానమహం కలిపే
నేను పట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ, పూర్వ జన్మల్లో కూడా సంభవించిన శరీరసంచింధి మూడురకాల పాపాలూ, మాటలకు సంబంధించిన నాలుగు రకాల పాపాలూ, మనస్సుకు సంబంధించి. మూడురకాల పాపాలు మొత్తం ఈ పదిరకాల పాపాలనూ పోగొట్టి, 33 తరాల పితృదేవతలకూ బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించే జ్యేష్టమాస శుక్ల దశమి శుభవారం నాడు. గంగానదిలో స్నానం చేస్తున్నాను.
అని సంకల్పం చెప్పుకుని నదిలో పది మునకలు వేయాలి. సూర్యునికి పన్నెండుసార్లు అర్ఘ్యం ఇచ్చిన తరువాత. "తూర్పుగా తిరిగి మరో పది మునకలు. వేయాలి. సంకల్పంలోని మన విశ్వాసమే మనలోని పాపల్ని పోగొట్టి తీరుతుంది.
🙏
4