TGEMPLOYEES
June 8, 2025 at 06:07 AM
*సమస్యలు - సమాధానాలు* 1.ప్రశ్న: *ఒక ఉద్యోగి 5 రోజులు జీతనష్టపు సెలవు పెట్టారు. మధ్యలో రెండవ శనివారం, ఆదివారం వచ్చాయి. ఆ రెండు రోజులను ఎలా పరిగణించాలి?* జవాబు: *జీతనష్టపు సెలవు మధ్య కాలంలో ప్రభుత్వ సెలవు వస్తే ఆ రోజులను కూడా జీత నష్టపు సెలవుగానే పరిగణించాలి.* 2.ప్రశ్న: *పెన్షన్ లెక్కించేటప్పుడు అదనపు విద్యార్హతల ఇంక్రి మెంట్లు ప్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్లు పరిగణనలోకి తీసుకోవటం లేదు. దానికి సంబంధించిన ఉత్తర్వులు ఉంటే తెలియజేయగలరు.* జవాబు: *జిఓ ఎంఎస్ నం. 177 ఆర్థిక; తేదీ. 28.06.1988 ప్రకారం పెన్షన్ లెక్కింపుకు మూలవేతనం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అందువలన అదనపు విద్యార్హతల ఇంక్రిమెంట్లు కుటుంబ నియంత్రణ ప్రోత్సహక ఇంక్రిమెంటు పెన్షన్ లెక్కింపుకు పరిగణనలోకి తీసుకోరు.* 3.ప్రశ్న: *ముగ్గురు పిల్లలు ఉన్న వారికి చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వ వచ్చునా?* జవాబు: *ఇవ్వవచ్చు. చైల్డ్ కేర్ లీప్కు సంబంధించిన ఉత్త ర్వులలో ఇద్దరు పిల్లలకు వాడుకోవచ్చు అని మాత్రమే ఉంది. ఎంతమంది పిల్లలు ఉండాలనే ప్రస్తావన లేదు* 4.ప్రశ్న: *ఒక ఉపాధ్యాయుడు 15 రోజులు కమ్యూటెడ్ సెలవు పెట్టుకుని ఉన్నారు. ఆ సెలవు మంజూరు చేసి సేవా పుస్తకంలో నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు కమ్యూటెడ్ సెలవును అర్థ జీతం సెలవుగా మార్చమని దరఖాస్తు చేశారు. చేయవచ్చునా?* జవాబు: *సెలవనిబంధనలు ప్రకారం ఒకసారి మంజూరు చేసిన సెలవును మార్పు చేయుటకు అవకాశం లేదు* ☞︎︎︎ *క్రింది లింక్ ద్వారా మన What's App Channel ను Follow అయ్యి తాజా  సమాచారం వెంటనే పొందవచ్చు** https://whatsapp.com/channel/0029VaCtKDCHLHQQd6oMTG2e ☞︎︎︎ పై లింక్ పై చేసి Top Right Corner లో Follow పై క్లిక్ చేసి, వెంటనే బెల్ గుర్తు🔔 పై క్లిక్ చేయాలి
👍 🙏 😂 10

Comments