TGEMPLOYEES

8.0K subscribers

About TGEMPLOYEES

**TELANGANA ఉద్యోగులకు ప్రతిరోజూ విలువైన సందేహాలు - సమాదానాలు మరియు సర్వీస్ రూల్స్ మరియు లేటెస్ట్ సమాచారం అందించాలి అనే ఉద్దేశంతో TELANGANA ప్రభుత్వ ఉద్యోగుల ఛానల్ రూపొందించడం జరిగింది. ఇందులో ఎలాంటి గ్రూపుల బెడద మరియు అనవసరమైన మెస్సేజెస్ లు ఉండవు కేవలం ఉపయోగపడే మెసేజెస్ మాత్రమే ఉండటం జరుగుతుంది**

Similar Channels

Swipe to see more

Posts

TGEMPLOYEES
6/16/2025, 7:15:13 AM

*సందేహాలు -TGEMPLOYEES - సమాధానాలు* *1. ప్రశ్న:* ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా?? *✅జవాబు:* అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు. °°°°°°°°°°°°°°°°°°°°°° *2. ప్రశ్న:* LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి?? *✅జవాబు:* LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది. °°°°°°°°°°°°°°°°°°°°°° *3. ప్రశ్న:* నేను 1996 డిసెంబరు లో sgt గా చేరాను.ఐతే 2001 లో 142 రోజులు,2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీత నష్టం (ఇఓఎల్) సెలవు పెట్టాను. ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ ను డిసెంబరు కి మార్చుకొనే అవకాశం లేదా?? *✅జవాబు:* జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో deo ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసు గా పరిగణించబడుతుంది. °°°°°°°°°°°°°°°°°°°°°° *4. ప్రశ్న:* సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా?? *✅జవాబు:* సస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం(హాఫ్ పే,హాఫ్ డీఏ,హాఫ్ హెచ్ఆర్ఏ)ఇస్తారు. °°°°°°°°°°°°°°°°°°°°°° *5. ప్రశ్న:* ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరు హాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా?? *✅జవాబు:* FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. °°°°°°°°°°°°°°°°°°°°°° *6. ప్రశ్న:* నేను SGT ను.75% అంగవైకల్యం తో బాధపడుతున్నాను.నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను.నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. డిగ్రీ,బీ.ఎడ్ చేశాడు. నా ఉద్యోగం నా తమ్ముడు కి ఇప్పించవచ్చా?? *✅జవాబు:* మీ ఉద్యోగం ఎవ్వరికీ నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ జీఓ.66 జీఏడీ తేదీ:23.10.2008 ప్రకారం మీరు అనారోగ్యంతో విధులు నిర్వర్హించలేక పోతున్నారని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన, మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద రిటైర్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ పోస్టు కారుణ్య నియామకం కోటాలో ఇవ్వటానికి అవకాశం ఉంది. °°°°°°°°°°°°°°°°°°°°°° *7. ప్రశ్న:* ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవి సెలవుల్లో ssc అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల విధులను ఎవరికి అప్పగించాలి?? *✅జవాబు:* ఆర్.సి.132 తేదీ:14.5.14 ప్రకారం బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవిలో ssc భాద్యతను ఆ ఉన్నత పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించాలి. °°°°°°°°°°°°°°°°°°°°°° *8. ప్రశ్న:* విద్యాహక్కు చట్టంలోని ఏ నిబంధన ప్రకారం 1 నుండి 8వ తరగతి వరకు పిల్లలను నేరుగా చేర్చుకోవచ్చు?? *✅జవాబు:* విద్యాహక్కు చట్టం 2009 లోని 2వ అధ్యాయం 4వ సెక్షన్ ప్రకారం 6--14 వయస్సు గల పిల్లలను వారి వయస్సుకి తగిన విధంగా 1--8 తరగతులలో నేరుగా చేర్చుకోవలసి ఉంటుంది. °°°°°°°°°°°°°°°°°°°°°° *9. ప్రశ్న:* గత సంవత్సరం 9వ తరగతి లో ముగ్గురు పిల్లలు వార్షిక పరీక్షలు రాయలేదు. కనీసం 20% హాజరు కూడా లేదు. వారిని ఈ సంవత్సరం 10 లోకి చేర్చుకోవచ్చా?? *✅జవాబు:* 9,10 తరగతులు విద్యాహక్కు చట్టం పరిధిలోకి రావు.కావున కనీస హాజరు లేకుండా పై తరగతికి ప్రమోట్ చేయకూడదు. °°°°°°°°°°°°°°°°°°°°°° *10. ప్రశ్న:* ఒక LFL HM కి కన్వేయన్స్ అలవెన్సు ఎవరు మంజూరు చేయాలి?? *✅జవాబు:* జీఓ.40 తేదీ:7.2.02 ప్రకారం మండల పరిషత్ యాజమాన్యం లోని స్కూళ్ళు కి MEO నే కన్వేయన్స్ అలవెన్సు మంజూరు చేయాలి. ☞ *క్రింది లింక్ ద్వారా మన What's App Channel ను Follow అయ్యి తాజా  సమాచారం వెంటనే పొందవచ్చు* https://whatsapp.com/channel/0029VaCtKDCHLHQQd6oMTG2e ☞ **పై లింక్ పై చేసి Top Right Corner లో Follow పై క్లిక్ చేసి, వెంటనే బెల్ గుర్తు🔔 పై క్లిక్ చేయాలి*

👏 👌 3
TGEMPLOYEES
6/16/2025, 9:36:49 AM

Ifmis update new da @ 30.03%

Post image
❤️ 8
Image
TGEMPLOYEES
6/16/2025, 2:07:47 PM

*TG CPGET -2025 NOTIFICATION*

Post image
Image
TGEMPLOYEES
6/16/2025, 4:10:36 AM

*🔥🔥 *TG NEW DA 30.03%  Benefits Calculator with JUNE Salary*** 🔥🔥 https://tsemployee.in/da-benefit-calculator/ ▪️ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు  జి.ఓ 78 ద్వారా న్యూ DA(30.03%) ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కొత్త డీఏ 30.03% Junr నెల జీతంలో  పెరుగుదల అవడం జరుగుతుంది ▪️ ప్రస్తుత  మీ బేసిక్ పే తో  కొత్త డిఏ మరియు ఇంక్రిమెంట్ ఉంటే దానిని కూడా కలుపుకొని, మీ జీతంలో వచ్చే మార్పు ఒకే క్లిక్ తో కింది లింకు లొ  చూసుకోవచ్చు https://tsemployee.in/da-benefit-calculator/ ☞ *క్రింది లింక్ ద్వారా మన What's App Channel ను Follow అయ్యి తాజా  సమాచారం వెంటనే పొందవచ్చు* https://whatsapp.com/channel/0029VaCtKDCHLHQQd6oMTG2e ☞ **పై లింక్ పై చేసి Top Right Corner లో Follow పై క్లిక్ చేసి, వెంటనే బెల్ గుర్తు🔔 పై క్లిక్ చేయాలి*

❤️ 2
TGEMPLOYEES
6/14/2025, 5:26:44 AM

Software updated with DA Go 💥💥 *NEW DA @30.03% ARREARS CALCULATOR* 💥💥 http://tsemployee.in/newda/ తెలంగాణ ప్రభుత్వం  న్యూ DA(30.003%) తో మీ ప్రస్తుత బేసిక్ పే తో  01.01.2023  నుండి 31.05.2025 వరకు  మీరు పొందే డి.ఏ Arreares మనకి ఎంత వస్తుందో కింది వెబ్ పేజీలో  సులభంగా తెలుసుకోవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు 👇👇👇👇 http://tsemployee.in/newda ☞︎︎︎ *క్రింది లింక్ ద్వారా మన What's App Channel ను Follow అయ్యి తాజా  సమాచారం వెంటనే పొందవచ్చు** https://whatsapp.com/channel/0029VaCtKDCHLHQQd6oMTG2e ☞︎︎︎ పై లింక్ పై చేసి Top Right Corner లో Follow పై క్లిక్ చేసి, వెంటనే బెల్ గుర్తు🔔 పై క్లిక్ చేయాలి

TGEMPLOYEES
6/11/2025, 5:07:11 AM

📙✍️ <><><><><><><><><><><><> *సందేహాలు - సమాధానాలు - 6* ◼◼◼◼◼◼◼◼◼◼ *51. ❓ప్రశ్న:* నేను మున్సిపాలిటీ లో టీచర్ గా పని చేస్తున్నాను.నేను ఏ ఏ టెస్టులు పాస్ కావాలి? ✅జవాబు:* మున్సిపల్ సర్వీస్ రూల్స్ వచ్చిన 7.12.2016 నాటికి HM a/c టెస్టు పాస్ అయి ఉంటే 3 ఇయర్స్ వరకు EOT, GOT పాస్ కానవసరం లేదు.తదుపరి SA లు 12 ఇయర్స్ స్కేల్ కొరకు,SGT లు 24 ఇయర్స్ స్కేల్ కొరకు EOT, GOT తప్పక పాస్ కావాలి. °°°°°°°°°°°°°°°°°°°°°° *52. ❓ప్రశ్న:* తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో రాయాలా?? ✅జవాబు:* విద్యా శాఖ ఉత్తర్వులు మెమో.7679 తేదీ:14.9.2010 ప్రకారం తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో తప్పక రాయాలి. °°°°°°°°°°°°°°°°°°°°°° *53. ❓ప్రశ్న:* నేను 24 ఇయర్స్ స్కేల్ పొందిన పిదప పదోన్నతి పొందాను.నా వేతనం FR--22బి ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా?? ✅జవాబు:* లేదు.మీకు FR--22ఎ(i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతు0ది. °°°°°°°°°°°°°°°°°°°°°° *54. ❓ప్రశ్న:* మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు.రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను.ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా?? ✅జవాబు:* అవకాశం లేదు. జీఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలు కి మాత్రమే వర్తిస్తుంది. °°°°°°°°°°°°°°°°°°°°°° *55. ❓ప్రశ్న:* ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ? ✅జవాబు:* G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి. °°°°°°°°°°°°°°°°°°°°°° *56. ❓ప్రశ్న:* ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ? ✅జవాబు:* A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా "Leave Salary payable in India after the end of each calender month" కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు. °°°°°°°°°°°°°°°°°°°°°° *57. ❓ప్రశ్న:* సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ? ✅జవాబు:* FR-24 లో "Increment should be drawn as a matter of course,unless it is withheld" అని ఉంది.క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే. °°°°°°°°°°°°°°°°°°°°°° *58. ❓ప్రశ్న:* కారుణ్య నియామక పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా? ✅జవాబు:* కుటుంబ పెన్షన్ వస్తుంది.కాని G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు.అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది. °°°°°°°°°°°°°°°°°°°°°° *59. ❓ప్రశ్న:* ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన,ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ? ✅జవాబు:* జమ చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది. °°°°°°°°°°°°°°°°°°°°°° *60. ❓ప్రశ్న:* నేను ఒక CPS ఉద్యోగిని. ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్ క్లైం చేసుకోవచ్చు. ✅జవాబు:* మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది. (eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు. ☞ *క్రింది లింక్ ద్వారా మన What's App Channel ను Follow అయ్యి తాజా  సమాచారం వెంటనే పొందవచ్చు* https://whatsapp.com/channel/0029VaCtKDCHLHQQd6oMTG2e ☞ **పై లింక్ పై చేసి Top Right Corner లో Follow పై క్లిక్ చేసి, వెంటనే బెల్ గుర్తు🔔 పై క్లిక్ చేయాలి*

👍 ❤️ 😮 8
TGEMPLOYEES
6/16/2025, 2:16:51 PM

* *జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం* * దేశంలో రెండు విడతల్లో జనగణన * జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం * జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో 2026 అక్టోబర్ 1 నాటికి ముగియనున్న జనగణన * 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానున్న జనగణన #

Post image
👍 3
Image
TGEMPLOYEES
6/16/2025, 2:16:12 PM

*🏵️జూలై నుండి పాఠశాలలపై నిత్య పర్యవేక్షణ* *🌼జూలై నెల నుండి ప్రతి పాఠశాలలో అధికారులు పర్యటిస్తారు:* *✅పర్యటనలలో ప్రధానంగా పరిశీలించే అంశాలు:* 👉అకడమిక్ క్యాలండర్ ప్రకారం సిలబస్ ఫాలో అవుతున్నారా? లేదా? 👉ఉపాధ్యాయుల బోధన విధానం – ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నారు, Teacher Hand Book చూస్తారు. 👉విద్యార్థుల విద్యా ప్రమాణాలు పిల్లల సాంకేతిక మరియు విద్యా నైపుణ్యాల స్థాయి ఏ మేరకు ఉంది, స్టూడెంట్ assessment book పరిశీలిస్తారు. 👉PM-POSHAN (MDM) అమలు – మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో సక్రమంగా అమలు అవుతోందా? 👉NT Books పంపిణీ – విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయా లేదా? 👉యూనిఫాంలు పంపిణీ – యూనిఫాం విద్యార్థులకు అందించారా లేదా? 👉Sanitation (పరిశుభ్రత) – పాఠశాలలో శుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయి? 👉Drinking Water (తాగునీరు) – తాగునీరు సౌకర్యం ఉందా లేదా అన్నది పరిశీలిస్తారు. 👉ప్రతి ఉపాధ్యాయుడు మరియు పాఠశాల సిబ్బంది వీటిపై పూర్తిస్థాయి సమాధానం చెప్పగలిగే విధంగా సిద్ధంగా ఉండాలి. 👉విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. *🔶ఉపాధ్యాయ వేదిక*

TGEMPLOYEES
6/13/2025, 4:08:43 PM

సవరించిన రేటు ప్రకారం మంజూరు చేయబడిన డియర్‌నెస్ అలవెన్స్‌ను జూన్, 2025 జీతంతో కలిపి జూలై 1, 2025న చెల్లిస్తారు. జనవరి 1, 2023 నుండి మే 31, 2025 వరకు డియర్‌నెస్ అలవెన్స్ సవరణ కారణంగా బకాయిలు సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమ చేయబడతాయి.

👍 👌 12
TGEMPLOYEES
6/14/2025, 5:42:35 AM

*🔥🔥 *TG NEW DA 30.03%  Benefits Calculator with JUNE Salary*** 🔥🔥 https://tsemployee.in/da-benefit-calculator/ ▪️ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు  జి.ఓ 78 ద్వారా న్యూ DA(30.03%) ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కొత్త డీఏ 30.03% Junr నెల జీతంలో  పెరుగుదల అవడం జరుగుతుంది ▪️ ప్రస్తుత  మీ బేసిక్ పే తో  కొత్త డిఏ మరియు ఇంక్రిమెంట్ ఉంటే దానిని కూడా కలుపుకొని, మీ జీతంలో వచ్చే మార్పు ఒకే క్లిక్ తో కింది లింకు లొ  చూసుకోవచ్చు https://tsemployee.in/da-benefit-calculator/ ☞ *క్రింది లింక్ ద్వారా మన What's App Channel ను Follow అయ్యి తాజా  సమాచారం వెంటనే పొందవచ్చు* https://whatsapp.com/channel/0029VaCtKDCHLHQQd6oMTG2e ☞ **పై లింక్ పై చేసి Top Right Corner లో Follow పై క్లిక్ చేసి, వెంటనే బెల్ గుర్తు🔔 పై క్లిక్ చేయాలి*

😢 👍 😮 5
Link copied to clipboard!