Motivational By Sridhar Nallamothu
Motivational By Sridhar Nallamothu
May 23, 2025 at 01:14 AM
We are the expression of our animal nature.. మనల్ని మనం ప్యూరిఫై చేసుకోకపోతే ప్రతీ మనిషీలోనూ ఎంతో కొంత జంతు ప్రవృత్తి ఉంటుంది. ఆ జంతు ప్రవృత్తిని తొలగించుకోవడానికే స్పిరిట్యువాలిటీ ఉపయోగపడుతుంది. ఓ జ్ఞానవంతుడు ఉంటాడు.. విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. మంచి జాబ్ ఉంటుంది, సమాజంలో మంచి స్టేటస్ ఉంటుంది. కానీ అతని వ్యక్తిత్వంలో పొరలు పొరలుగా రాక్షస ప్రవృత్తి పెనవేసుకుపోయి ఉంటుంది. దానివల్ల అతనూ అన్ కాన్షియస్ బిహేవియర్ టెండెన్సీస్‌తో ఇబ్బంది పడతాడు. అతని వల్ల అతని చుట్టూ ఉన్న వాళ్లూ సఫర్ అవుతారు. "దేవుడుకి దండం పెడితే ఏమొస్తుంది, మంత్రాలు పఠిస్తే ఏమొస్తుంది.." వంటివి చాలా తెలివైన ప్రశ్నలుగా చాలామంది భావిస్తారు. వాస్తవానికి అది అమాయకత్వం. కొన్ని సెన్సార్లు బ్రెయిన్‌కి పెట్టి.. ఓ మనిషి బ్రెయిన్ వేవ్స్‌ని బీటా నుండి ఆల్ఫాకి మారడం కోసం అతన్ని ప్రయత్నించమన్నారు, మైండ్ స్లో డౌన్ చేసుకోమన్నారు. అరగంటా, గంటా గడిచినా స్క్రీన్ మీద అతని బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ Betaలోనే ఉండిపోయింది. చివరకు అతను నా వల్ల కాదు అనే భావనకు వచ్చాడు. ఎప్పుడైతే అది నా వల్ల కాదు అని అతను సరెండర్ అయిపోయాడో అప్పుడు ఆశ్చర్యకరంగా అతని బ్రెయిన్ వేవ్స్ ఉన్న ఫలానా ఆల్ఫాలోకి వచ్చాయి. అంటే నేను చెయ్యగలను అనే అహం యొక్క ఎక్స్‌ప్రెషన్ కన్నా.. అహాన్ని పక్కన పెట్టినప్పుడు హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ పెరిగి బ్రెయిన్ వేవ్స్ నెమ్మదిస్తాయి, మనస్సు కామ్ అయిపోతుంది. సోషల్ మీడియాలో చూసినా, బయట చూసినా మనుషులు పశువుల కన్నా హీనంగా అయ్యారు. నోరు తెరిస్తే బూతులు, ద్వేషం, అసూయ, కోపం ఇవన్నీ! ఈ భావోద్వేగాలన్నీ ఎవర్ని నాశనం చేస్తాయి మిమ్మల్నే, మీ చుట్టూ ఉన్న వాళ్లనే!! ఈ యానిమల్ టెండెన్సీస్‌తో బ్రతికే ప్రతీ ఒక్కరూ గమనించండి.. మీ స్వభావం వల్ల మీ కుటుంబంలో కూడా మిమ్మల్ని ఓ నెగిటివ్ వ్యక్తిగా లోపల భావిస్తారు, పైకి ప్రేమ నటిస్తూ ఉండొచ్చు. అందుకే బయటకెళ్లి ఇంటికొచ్చాక మురికి వదిలించుకోవడానికి స్నానం ఎలా చేస్తామో.. మన మనస్సుని మనం అలా శుద్ధి చేసుకోవాలి. మీరు బయట ఎంతో మంది నెగిటివ్ పీపుల్‌ని కలిసి వస్తూ ఉండొచ్చు, ఫేస్‌బుక్ లాంటివి ఓపెన్ చేస్తే ఎన్నో నెగిటివ్ పోస్టులు కనిపించవచ్చు. అవన్నీ మీ ఎనర్జీ ఫీల్డ్‌ని నాశనం చేస్తాయి. లోయర్ వైబ్రేషనల్ స్థితికి చేరుకుంటారు. అలాంటి స్థితిని మెడిటేషన్, ప్రాణాయామం, మంత్ర సాధన వంటి వాటితో ప్యూరిఫై చేసుకోవడంలో తప్పేముంది? ఎవర్ని బాగుపరుచుకుంటున్నారు? మిమ్మల్నే కదా! దీనికి ఎందుకు అంత అశ్రద్ధ. ఆ నాకు అంత టైమ్ లేదు అని అనకండి. యుద్ధం గురించి కొన్ని వందల గంటలు కనిపించిన వీడియోనల్లా చూసినప్పుడు టైమ్ ఎక్కడ నుండి వచ్చింది? గంటల తరబడి ఇన్ స్టా రీల్స్ చూసేటప్పుడు టైమ్ ఎక్కడ నుండి వచ్చింది? నేను 2011 నుండి ధ్యాన సాధనలో ఉన్నాను. ఏళ్ల తరబడి డిసిప్లెయిన్‌తో సాధన చేస్తూనే ఉన్నాను. ఈరోజు ప్రతీ చిన్న విషయానికీ నేను స్పందించకపోవడానికి నాకు హెల్ప్ అయింది నా సాధన. నేను చేసే పనిపట్ల ఫోకస్ గా ఉండడానికి అది హెల్ప్ అయింది. అలాగే నిరంతరం నా స్టేట్ ఆఫ్ మైండ్ ప్రేమతోనూ, ఓ పాజిటివ్ దృక్పధంతో ఉండడానికి నా సాధన నాకు హెల్ప్ అయింది. ఈ భూమ్మీద పుట్టాక ఎంత సంపాదించాం, ఎన్ని బిల్డింగులు కట్టాం అన్న దానికన్నా ఈ క్షణంలో ఎంత సంతోషంలో ఉన్నామన్నది ముఖ్యం. సంతోషం అంటే.. వెకిలితనంలో ఉండదు, ప్రేమలో ఉంటుంది. సంతోషం అంటే సినిమా కామెడీ సీన్స్ చూస్తూ ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేస్తూ.. బయట పొందేది కాదు. ఏ మనస్సు అయితే ప్యూరిఫై అవుతుందో అక్కడ బై డీఫాల్ట్ bliss ఉంటుంది. బ్లిస్ అంటే సంతోషం కాదు... వాస్తవానికి సంతోషం వెనుకే దుఃఖమూ ఉంటుంది. కానీ bliss అంటే బయట ఏదీ లేకపోయినా మనస్సులో నిరంతరం నిశ్చలంగా ఉండే సంతోషకరమైన స్థితి. దాన్ని సాధించడానికి మించిన ఆస్థులు ఏముంటాయి? నేను షాపింగులు చెయ్యను.. వాటి ద్వారా నాకు ఆనందం వచ్చేది లేదు... నేను ఫ్రెండ్స్‌ని వేసుకుని తిరగను, చాలా ఏళ్లుగా నాతో నేనే ఉన్నాను, ఎప్పుడో కాసేపు ఎవరో కలుస్తారు. ఒంటరిగా ఉన్నా నాలో wholeness ఉంది కాబట్టి నేను సంతోషం కోసం మనుషుల్ని వెదుక్కోను. నాకు ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన కారు, ఇష్టమైన అంటూ ఏదీ లేదు. అయిష్టమైనది అంటూ కూడా ఏదీ లేదు. మన అంతర్గత స్థితిని బయట ఏదీ శాసింసలేనప్పుడు అంతకన్నా స్వేచ్ఛ, సంతోషం ఏముంటుంది? ఇతరుల్ని చూసి ఏడ్వడం.. అసూయపడడం, కోప్పడడం ఏమీ ఉండదు, నా గురించి నాకు తెలిసిన వాళ్లే వాళ్ల వ్యక్తిత్వ లోపాల వల్ల ఒకరిద్దరు చెడ్డగా చెప్తుంటారు అని తెలిసినా.. వాళ్లతోనూ ప్రేమగానే ఉంటాను. ఇంతకన్నా ఏం కావాలి.. స్పిరిట్యువాలిటీ, స్పిరిట్యువల్ ప్రాక్టీసెస్ మనిషిని ప్యూరిఫై చేస్తాయి. సఫరింగ్ లేకపోవడానికి మించిన bliss ఏముంటుంది? అందుకే నామోహీ వదిలేసి మెడిటేషన్ లాంటివి చేయండి.. మంత్రాలు పఠిస్తే ఎనర్జీ బ్లాకేజెస్ పోతాయి. యూట్యూబ్ లలో చెప్పినట్లు డబ్బులు వస్తాయనో, ఇంకో ఆశతోనో స్వార్థం కొద్దీ ఏ సాధనా చెయ్యకండి.. మనిషి అహం, స్వార్థం పోగొట్టుకుంటే ప్రతీదీ మనల్ని ఉన్నతమైన జీవితం వైపు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా 2011 నుండి నేను సాధన చెయ్యకపోయి ఉంటే ఇంత హాపీ, ప్రశాంతంగా, స్థిమితంగా ఉండగలిగే వాడిని కాదు! I love it. నేను స్వామి వివేకానందని జీవితంలో ఆదర్శంగా తీసుకుని నా టెన్త్ నుండి లైఫ్ లీడ్ చేసిన వ్యక్తిని. కొన్నిసార్లు ఆయన నడిచిన అన్ని మార్గాల్లో ఉన్నందుకు సంతృప్తిగా ఉంటుంది. - నల్లమోతు శ్రీధర్
🙏 ❤️ 👍 👏 😇 36

Comments