
Motivational By Sridhar Nallamothu
May 24, 2025 at 01:34 AM
ఎందుకు దీనిపై రీసెర్చ్ చేస్తున్నానో ఇది చదివాక మీకు పూర్తిగా అర్థమవుతుంది! Don't Miss it -నల్లమోతు శ్రీధర్
సుబ్రహ్మణ్య త్రిశతీ స్తోత్రం తీసుకుందాం. ఆ ఇలాంటివి చదివితే ఏమొస్తుందిలే అనే క్లోజ్డ్ మైండ్‌సెట్‌తో కాకుండా, వీటి వెనుక ఎంత సైన్స్ ఉందో అర్థం చేసుకునే ప్రయత్న చేద్దాం.
ఇందుకే ఒకటి రెండు శ్లోకాలు, వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ మాత్రమే వివరిస్తాను, సమయాభావం వల్ల! మొదటి శ్లోకం తీసుకుందాం.
శ్రీం సౌం శరవణభవః శరచ్చంధ్రాయుతప్రభః|
శశాంకశేఖరుతః శచీమాంగళ్యరక్షకః||
నోరే తిరగడం లేదు.. ఇవన్నీ మాకు అవసరమా అని చాలామంది ఇక్కడే ఆగిపోతారు. లేదా ఇలాంటివి చదివితే దేవుడు కరుణిస్తాడట, నేను నమ్మను ఇలాంటి ట్రాష్ అంతా అని వెకిలి నవ్వుతో ముందుకు సాగుతారు. మంత్రమైనా, స్తోత్రమైనా, అష్టోత్తర శతనామావళి అయినా మీరు నిశితంగా గమనిస్తే కొన్ని కొన్ని అక్షరాలను శరీరంలో వివిధ ప్రదేశాల్లో శక్తిచలనం (ఎనర్జీ మూమెంట్) జరిగేలా పదాల అమరిక చేసిన మాల లాంటి ఏర్పాటు.
పైన "శ్రీం" అనే బీజాక్షరాన్నే తీసుకుందాం. అది s, ri, m అనే మూడు భాగాలుగా విడదీసి డీటైల్డ్‌గా చూద్దాం.
స్.. అన్నప్పుడు శ్రద్ధగా గమనించండి.. శబ్ధం ఎక్కడ మూమెంట్ అవుతోంది నాలుక పై భాగంలో ఉండే అంగిటిలో అంటే hard palateలో శబ్ధం ఏర్పడుతున్నట్లు గమనించండి. ప్రాక్టికల్‌గా మీరే గమనించండి.
ఇప్పుడు "శ్రీ" అనే పదాన్ని మెల్లగా గమనిస్తూ పలకండి. అర్థం కాకపోతే ఒకటి పదిసార్లు గమనించండి. "శ్రీ" అన్నప్పుడు మీ నాలుకలోని మధ్య భాగం పై పళ్ల అంచుల నుండి మొదలుపెట్టి అంగిటిలో (hard palate) కొంత భాగం వరకూ మూవ్ అవుతోందా లేదా?
ఈ hard palate కేవలం ఓ ఎముక. ఇది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌లో గుర్తించినట్లు శరీరంలో శక్తి ప్రవహించే మెరీడియన్స్ ఛానెల్స్‌ని కూడా కలిగి ఉంటుంది. (బాడీ మెరీడియన్, హ్యాండ్, లెగ్ మెరీడియన్ మాత్రమే కాదు), శరీరాన్ని చాలా రిలాక్స్ చేసే vagus (వేగస్)నెర్వ్ చివర్లు, గ్లాసో ఫరాంజియల్, ఫేసియల్ నెర్వ్స్ అంచులు ఇక్కడ ఉంటాయి. యోగ శాస్త్రం ప్రకారం ఇడా, పింగల, సుషుమ్న నాడుల కలయిక సంబంధించిన పాయింట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో "శ్రీ" అనే పదాన్ని తరచూ అంటుంటే.. బ్రెయిన్ స్టెమ్, అటానమస్ నెర్వస్ సిస్టమ్‌లోని భాగమైన హైపోధలామస్, అన్ని హార్మోన్లకి మాస్టర్ గ్లాండ్ అయిన పిట్యూటరీ గ్లాండ్, వేగస్ నెర్వ్ గుండా థైమస్ గ్లాండ్ యాక్టివేషన్ జరుగుతాయి. థైమస్ గ్లాండ్ ఛాతీలో పై భాగంలో ఉంటుంది. వయస్సుతో పాటు ఇది క్షీణించినా మంత్ర సాధనతో ఇది కొంత వరకూ యాక్టివేట్ అవుతుంది. ఇది ఇమ్యూనిటీని అందించే గ్లాండ్.
పై శ్లోకంలో శ్రీ వరకూ మాత్రమే చూశాం. శ్రీం.. అని చూడండి. చివర్లో వచ్చే "మ్" అన్నప్పుడు శబ్ధం ఎక్కడికి వెళుతుంది.. బ్రెయిన్‌లో పై భాగం వరకూ వైబ్రేట్ అవుతూ.. (దీనిని cranial dome అంటారు) మైండ్‌ని ప్రశాంతంగా చేస్తుంది.
అంటే శ్రీం అనే ఓ బీజాక్షరాన్ని పలికితేనే అనాహత చక్ర దగ్గర ధైమస్ గ్లాండ్ యాక్టివేట్ అవడం మొదలుకుని వేగస్ నెర్వ్ స్టిములేషన్, బ్రెయిన్‌లో వైబ్రేషన్ ద్వారా మైండ్ కామ్ అవడం చూశారు కదా!
పైన శ్లోకంలో మిగతా భాగాలు మళ్లీ వివరంగా రాస్తాను.
చివరిగా ఒకటే చెబుతున్నాను.. మంత్రం అంటే సౌండ్ రిసొనెన్స్. వివిధ ఫ్రీక్వెన్సీలలో కంపనం కలిగించడం ద్వారా శరీరంలో వివిధ భాగాలను యాక్టివేట్ చేస్తుంది. ఇక నమ్మడం నమ్మకపోవడం మీ ఛాయిస్. ఎవరైనా నమ్మకపోయినా ఎవరికీ నష్టం లేదు. అలాగ నమ్మి రోజూ పఠించే వారు వాళ్ల ప్రయోజనాలు వాళ్లు పొందుతూనే ఉంటారు.
- నల్లమోతు శ్రీధర్
🙏
❤️
❤
👍
👏
😍
42