
Motivational By Sridhar Nallamothu
May 25, 2025 at 02:14 AM
సాధన లేని నాలెడ్జ్ ఇప్పుడున్న సొసైటీకి అతి పెద్ద శత్రువు. రోజూ సాధన చెయ్యనిదే ఏ మంత్రమూ, ఏ ధ్యానమూ మనల్ని హైయ్యర్ డైమన్షన్స్కి చేర్చదు. We accumulated lot of emotional dust in our energy body in our life time. దాన్ని మొత్తాన్ని దుమ్ము దులపాలంటే చాలా సాధన కావాలి.
ఈరోజు ఆధ్యాత్మికత, సోల్, లైఫ్ పర్పస్, ఆఫ్టర్ లైఫ్ గురించి మాట్లాడమంటే ప్రతీ ఒక్కరూ అనర్గళంగా మాట్లాడే విషయ పరిజ్ఞానం ఉంది. యుద్ధం వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరూ అక్కడా ఇక్కడా కాస్త చదివి, విదేశాంగ విధానాల గురించి కూడా పొల్లుపోకుండా ఎలా మాట్లాడతారో.. ఆధ్యాత్మిక జ్ఞానాన్నీ ఏ చాగంటి వారి, గరికపాటి వారి ప్రవచనాలు వినో, ఫేస్బుక్లో ఆధ్యాత్మిక గ్రూపుల్లో ఉండడం వల్లనో తడుముకోకుండా మాట్లాడగలుగుతారు.
కానీ ఆధ్యాత్మిక జ్ఞానం విషయ పరిజ్ఞానం లాంటిది కాదు. ఇంకా చెప్పాలంటే.. రాముడు అలా చేశాడు, కృష్ణుడు అలా చేశాడు, మనమూ అలా ధర్మబద్ధంగా ఉండాలి.. వంటి కధల్లాంటి నాలెడ్జ్ అంతా మైండ్ స్థాయిలో తిరుగుతూ.. మనిషిని అనలటికల్ మైండ్ దాటి సోల్కి కనెక్ట్ అవకుండా అడ్డుకుంటుంది.
అందుకే మీరు గమనిస్తే.. ఏమీ తెలీకుండా కేవలం విశ్వానికి శరణాగతితో ఉండే ఏ పల్లెటూళ్లో ఉన్న వాళ్లో, సరిగా చదువుకోని వారో కూడా కొన్నిసార్లు బ్రహ్మజ్ఞానం పొందగలుగుతారు. ఈ త్రీ డైమెన్షనల్ ప్రపంచం నుండి లిబరేట్ అవుతారు.
అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రోగ్రెస్ అవ్వాలనుకున్న వారు మొదట విషయ పరిజ్ఞానాన్ని తగ్గించండి. ప్రపంచంలో జరిగే ప్రతీదీ తెలుసుకోవడం, దాన్ని విశ్లేషించడం, భావోద్వేగాలకు గురి కావడం వల్ల ప్రపంచానికి ఏమీ ఉపయోగం లేకపోగా మీరు ఎంత మంత్రజపం చేసినా, ఎంత మెడిటేషన్ చేసినా.. ఫలానా రాజకీయ నాయకుడు ఫలానా వాళ్లని బూతులు తిట్టాడు అని చదవగానే... మీలో వచ్చే కోపమో, సంతోషమో అప్పటిదాకా మీరు చేసిన సాధనా ఫలితాన్ని మొత్తాన్నీ లాక్కెళ్లిపోతుంది.
నేను గత నాలుగు సంవత్సరాలుగా పేపర్ చదవట్లేదు. ప్రపంచంలో ఏం జరుగుతోందో నాకు తెలీదు. టివి చూడను, యూట్యూబ్లో న్యూస్ ఛానెల్స్ గానీ, ప్రాపంచిక విషయాలకు సంబంధించివీ గానీ ఏ వీడియోలూ చూడను. ఇదేదో గొప్ప విషయం కాదు.. కానీ simply I'm protecting my enery field. దీనివల్ల నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఎంతో డీప్ స్టేట్లోకి వెళ్లడం సాధ్యమవుతోంది. ఒకే ఇంట్లో ఒక వైపు చెత్తా, మరో వైపు శుభ్రతా ఉండలేవు. మీ మనస్సనే ఇంట్లో చెత్త ఉండాలా శుభ్రత ఉండాలా మొదట డిసైడ్ చేసుకోండి.
అలాగే ఏళ్ల తరబడి మన మనస్సులో పొరలుపొరలుగా బ్లాకేజెస్గా ఏర్పడిపోయిన వాటిని తొలగించుకోవడానికి నిరంతరం మంత్రం గానీ, ధ్యానం గానీ ఒక్కరోజు కూడా మిస్ అవకుండా చేసే ప్రయత్నం చేయండి. రోజూ ధ్యానం చేసే వ్యక్తి, రోజూ మంత్రజపం చేసే వ్యక్తికి మనస్సు ఆధీనంలో ఉంటుంది. ఎవరి జోలికీ వెళ్లడు, ఎవరు తన జోలికి వచ్చినా పెద్దగా రియాక్ట్ అవడు. అంతకన్నా యోగం ఏముంటుంది?
అందుకే.. మళ్లీ మళ్లీ చెబుతున్నాను సాధన చేయండి.. ఇప్పటికే మనకు చిన్న చీమ మొదలు అణుబాంబు వరకూ అనర్గళంగా మాట్లాడగలిగే నాలెడ్జ్ ఉంది. అది మీ జీవితానికి నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు. అదే నాలెడ్జ్ స్థానంలో సాధన మొదలుపెట్టండి, జీవితం ఎలా మారుతుందో మీరే చూడండి. ఈరోజు మీరు మెడిటేషన్ చేశారా, మంత్ర జపం చేశారా ఇదే అత్యంత ముఖ్యం.. ఈరోజు మీరు చాగంటి వారి ప్రవచనం విన్నారా లేక, కుంఢలినీ శక్తి యాక్టివేషన్ గురించి చదివారా అన్న దానికన్నా! ఇలా చెప్పేవాళ్లు కూడా మీకు దొరకరు. ఇక మీ ఇష్టం.
- నల్లమోతు శ్రీధర్
❤️
🙏
👍
24