
Motivational By Sridhar Nallamothu
June 6, 2025 at 12:22 PM
మన ఆస్ట్రల్ బాడీలోని ఎనర్జీ లీక్స్‌ని మంత్రాలు ఎలా నిరోధిస్తాయి? సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ సిరీస్ - నల్లమోతు శ్రీధర్
తంత్ర శాస్త్రం ప్రకారం శరీరంలోని 72,000 నాడులు, మూలాధార నుండి సహస్రార వరకూ అన్ని చక్రాలు కలిసి మనిషి జీవితాన్ని నడిపించే ఓ ఎనర్జటిక్ మెష్‌గా పనిచేస్తాయి. ఆ ఎనర్జటిక్ మెష్సే ఆస్ట్రల్ బాడీ. ఈ మెష్ దెబ్బతిన్నప్పుడు ఎనర్జీ వృధా అవుతూ ఉంటుంది.
మొదట ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటో చెబుతాను. మనిషి శరీరం అన్నమయ కోశం (ఫిజికల్ బాడీ), మనోమయ కోశం (మెంటల్ బాడీ), శక్తిమయ కోశం (ఎనర్జీ బాడీ), విజ్ఞాన, ఆనందమయ కోశం అని వివిధ లేయర్స్‌గా ఉంటుందని చాలామందికి తెలిసిందే.
వీటిలో మనోమయ కోశం నిరంతరం ఆలోచనలకు, ఎమోషన్స్‌కి కారణం అవుతూ ఉంటుంది. ఈ భావోద్వేగాలు, కాన్షియస్‌నెస్‌ని ఆధారంగా చేసుకుని శరీరంలో ప్రాణశక్తి కదలిక జరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం సమాహారమే ఆస్ట్రల్ బాడీ! దీనినే సూక్ష్మ శరీరం అని కూడా అనుకోవచ్చు. మన భౌతిక రూపం లోపల ఎనర్జీతో భౌతిక శరీరాన్ని నడిపిస్తున్నశరీరం అది!
ఉదా..కి ప్రాణశక్తి (ఆక్సిజెన్ కాదు) మూలాధార చక్ర నుండి నాభి క్రింద ఉండే స్వాధిష్టాన చక్రని ప్రవహించాలంటే మూలాధార చక్రకి సంబంధించిన భయం, అభద్రత వంటి ఏ భావోద్వేగాలూ ఉండకూడదు. మనిషి భూమి మీద చాలా సురక్షితంగా ఉన్నట్లు ప్రతీ క్షణం అతని మానసిక స్థితి ఉంటే మూలాధార చక్ర బలంగా ఉండి, పై చక్రాలకు ఎనర్జీని ప్రవహించచేయగలుగుతుంది. ఇలా ప్రతీ చక్రానికి కొన్ని భావోద్వేగాలు, శరీరంలో నాడులు, అవయువాలు అనుసంధానమై ఉంటాయి.
ఎప్పుడైతే జీవితంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయో, మానసికంగా గాయాలు అవుతాయో, అవన్నీ ఎమోషనల్ బ్లాకేజెస్గా ఏర్పడి అన్ని చక్రాస్తో కూడిన మీ auraని క్షీణింపజేస్తాయి. అలాగే నిరంతరం మీ మైండ్‌లో ఏర్పడే నెగిటివ్ థాట్స్ వల్ల కూడా ఎనర్జీ బాడీ క్షీణిస్తూ ఉంటుంది. అందుకే చాలామంది ఎంత మంచి ఆహారం తిన్నా సరిగా వంటబట్టదు, దీనికి leaky gut (చిన్న ప్రేగు అంచులు లీక్ ఉండడం వల్ల పోషకాలను శరీరం సరిగా స్వీకరించడం లేదని) వంటి భౌతికమైన కారణాలు భావిస్తారు గానీ, ఇవన్నీ మానసిక వత్తిడి కాస్తా మెల్లగా ఇన్‌ఫ్లమేషన్‌గా ఏర్పడి చివరకు భౌతికమైన సమస్యలుగా మారిన విషయాలే! ఈ ఎనర్జీతో కూడిన సూక్ష్మ శరీరం బలహీనంగా ఉంటే నిద్రలో శరీరం పక్షవాతం వచ్చినట్లు నిద్రపోయినంతసేపు చచ్చుబడిపోవడం, శరీరాన్ని వదిలి పైన విహరిస్తున్న భావన (దీన్ని చాలామంది ఆస్ట్రల్ ట్రావెల్‌గా భ్రమిస్తారు), విపరీతమైన అలసట, విల్ పవర్ లేకపోవడం, మానసికంగా చాలా సున్నితంగా మారిపోవడం, బయట మనుషులతో కలిసినప్పుడు చాలా శక్తిని కోల్పోయినట్లు అనిపించడం వంటి చాలా సమస్యలు వస్తాయి. ఆస్ట్రల్ బాడీ బలహీనపడడానికి ప్రధాన కారణాలు తరచూ అసూయ పడడం, ఇతరుల గురించి ఎక్కువగా పుకార్లు చెప్పుకోవడం, వివిధ వ్యసనాలకు బానిస అవ్వడం వంటి అనేక అంశాలు కారణమవుతాయి.
వివిధ మంత్రాల్లోని అక్షరాలు ఒకదానితో ఒకటి పొందిక కలిగి ఉంటాయి. వాటిని పఠించినప్పుడు శరీరంలో ఓ ప్రత్యేకమైన ఎనర్జీ రూపం ఏర్పడుతుంది. దీనివల్ల అప్పటి వరకూ మీ ఆస్ట్రల్ బాడీ గందరగోళంగా వైబ్రేట్ అవుతున్నది కాస్తా మంత్ర సాధన వల్ల మీ ఎనర్జీ ఫీల్డ్‌లో ఓ పొందిక ఏర్పడుతుంది. ఉదా.కి.. ఎనర్జీ బాడీలో శక్తి విచిత్రంగా లీక్ అవుతూ ఉంటుంది. కొంతమంది అదే పనిగా ఆజ్ఞాచక్ర (థర్డ్ ఐ) ప్రాక్టీసెస్ మాత్రమే చేస్తుంటారు. దీనివల్ల ఎప్పుడూ ఆధ్యాత్మికత గురించే మాట్లాడతారు, ఆలోచిస్తారు తప్పించి భూమ్మీద తాము చెయ్యాల్సిన బాధ్యతలు, కుటుంబం అన్నీ వదిలేస్తారు. ఇది సరిగా గ్రౌండింగ్ లేకపోవడం వల్ల ఏర్పడే ఎనర్జీ లీకేజ్. ఇలాంటి వాటిని మంత్రాలు సరిచేస్తాయి.
అలాగే కొంతమంది విపరీతంగా సెక్సువల్ కోరికలు కలిగి ఉంటారు. అదేమంటే లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యడానికే పుట్టామంటారు. వాస్తవానికి స్వాధిష్టాన చక్ర (శాక్రల్ చక్ర) ఓవర్‌గా స్టిములేట్ అయినప్పుడు వచ్చే సమస్యలు ఇవి. దీనివల్ల శాక్రల్ చక్ర ప్రాతినిధ్యం వహించే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వారిలో మెల్లగా దెబ్బతింటుంది. మంచి రచయితలైతే ఇలా విపరీతంగా సెక్సువల్ ఆలోచనతో స్వాధిష్టాన చక్ర అసమతౌల్యతకు గురైన తర్వాత వారి రాతల్లో పస తగ్గిపోతుంది. అలాగే మణిపూరక చక్ర అదుపు తప్పితే అహం తన్నుకు వస్తుంది. " అంతటి వాడు లేడు" అనే బాపతు జనాలంతా ఈ కోవకే చెందుతారు. మంత్రాల్లో "ఓం నమశ్శివాయ", "గాయత్రీ మంత్రం" వంటివి ఇలా విపరీతంగా ఓవర్ యాక్టివ్‌గా పనిచేస్తున్న చక్రాస్ని బ్యాలెన్స్‌లోకి తెస్తుంది.
మంత్రాలు మన ఎనర్జీ ఫీల్డ్‌లో నిలువుగా ఉండే తరంగాలను సృష్టిస్తాయి. ఈ తరంగాలు అదుపు తప్పిన, ఖాళీలు ఏర్పడిన ఎనర్జీ ఫీల్డ్‌ని ఎనర్జీ లీక్ అవకుండా ఓ క్రమపద్ధతిలోకి తెస్తాయి. ప్రతీ మంత్రమూ శరీరంలో ఏర్పరిచే ఎనర్జీ రూపాన్ని కళ్లకు కనిపించేలా చూడగలిగితే.. శబ్ధం అనేది మన శరీరంలో త్రికోణం (రెండు భుజాలు మొదలు తల వరకూ ఉన్న భాగాన్ని గమనించండి, అది త్రికోణంలో ఉంటుంది), చతురస్రం వంటి అనేక రూపాల్లో శక్తిని ఉత్పత్తి చేస్తూ, వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఆ భాగాల్లో ఉన్న నాడులు ఈ జామెట్రీ ద్వారా ప్రభావితం అవుతూ ఉంటాయి.
మంత్రాల శక్తిని తెలుసుకున్న ఎవరూ వాటిని వదిలిపెట్టలేరు.
మరింత సమాచారంతో మరో ఆర్టికల్‌లో కలుస్తాను.
- నల్లమోతు శ్రీధర్
🙏
❤️
❤
😇
18