TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
June 3, 2025 at 04:45 PM
*శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పు*
.................................
ప్రతి నిత్యం టీటీడీ సమాచారం కోసం
దిగువ 👇 వాట్సాప్ ఛానల్ లింక్ క్లిక్ చేసి జాయిన్ కాగలరు
https://whatsapp.com/channel/0029Va55ZfILY6dDN7ZksI2O
...............................
శ్రీవారి దర్శనార్థం *శ్రీవారి మెట్టువద్ద నుండి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు* దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని Ṭటీటీడీ నిర్ణయించింది. *శుక్రవారం (జూన్ 6 - 2025) సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో* ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇదే అంశానికి సంబంధించి టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం వర్చువల్ సమావేశం ద్వారా టీటీడీ అధికారులతో సమీక్షించారు . సమావేశం లోని కొన్ని ముఖ్య అంశాలు:
* ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇస్తారు
* దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర తమ ఆధార్ చూపించి స్కాన్ చేసుకోవాలి.
* శుక్రవారం టోకెన్లు పొందిన వారికి శనివారం దర్శనం కల్పిస్తారు
* ఇదే సమయంలో మరోపక్క ఎస్ ఎస్ డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో వాటి కొరకు నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు.
....................
*నారదపీఠం, తిరుపతి*
🙏
😂
❤️
👍
😢
48