
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
May 19, 2025 at 03:37 PM
తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. క్వార్టర్ బాటిల్ మద్యానికి రూ.10, హాఫ్, ఫుల్ బాటిళ్లపై రూ.20, 40 చొప్పున పెంచుతూ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది.
పెంచిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. డిపోలతో పాటు మద్యం దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసింది. బ్రూవరీల యాజమాన్యాల డిమాండ్ల మేరకు సర్కార్ నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచింది.
ఇదే క్రమంలో ఇప్పుడు మద్యం ధరలను పెంచింది. జస్టిస్ జైశ్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ ఫిబ్రవరి 11న సర్కార్ నిర్ణయం తీసుకుం ది. 2019 నుంచి రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగలేదు. ముడి పదార్ధాల రేట్లు పెరిగినా, అప్పటి ధరతోనే బ్రూవరీస్ కంపెనీలు సరఫరా చేస్తూ వచ్చాయి.
వివిధ సంప్రదారులు, బేవరేజెస్ కంపెనీల విజ్ఞప్తుల మేరకు ఒక్కో బీరు బాటిల్‌పై కనీసం రూ.18 నుంచి గరిష్ఠంగా రూ.50 వరకు పెంచుతూ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచింది ఇదే క్రమంలో ఇప్పుడు మద్యం ధరలను పెంచింది.