
Kazipet Swetharka Ganapati Temple
June 9, 2025 at 07:15 PM
*శ్వేతార్కగణపతి కళ్ళు తెరచి జూన్ 10 2025 నాటికి 11 సంవత్సరాలు పూర్తి*
*దేవాలయంలో మహా అన్నదానం*
స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి స్వామివారు తమ యొక్క దివ్య నేత్రములు తెరచినట్టుగా గోచరమై 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా...దేవాలయంలో విశేష అభిషేక, పూజ,హోమ,అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి. స్వయం వ్యక్తంగా ప్రకాశితమై లక్షలాది మంది భక్తుల ఇంటి ఇలవేల్పు దైవంగా భాసిల్లుతున్న *శ్రీ శ్వేతార్కమూలగణపతిస్వామివారు జూన్ 10 2014 మంగళవారం నాడు పాలతో అభిషేకం చేస్తున్న క్రమంలో తమ యొక్క దివ్య నేత్రాలు ఒకటి తర్వాత ఒకటి తెరిచి భక్తులను చూస్తున్నట్టుగా గోచరించింది.* ఈ సందర్బంగా శ్రీస్వామివారికి ఉదయం 7గంటలకు ప్రత్యేక పంచామృత ద్వాదశ వర్ణ వివిధ నదీ సముద్ర జలములతో మరియు అమర్నాథ్ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా తీసుకురాబడిన జలములతో అభిషేకం జరగనున్నది. ఆ తర్వాత విశేష అలంకరణ గణపతి పూజ,చతుర్వేద గణపతి సూక్త మహాగణపతి హోమం,హారతి,తీర్థప్రసాద మరియు *మహా అన్నదాన* వితరణ జరగనున్నది. కావున యావన్మంది భక్త మహాశయులందరూ శ్రీస్వామివారి యొక్క దివ్య దర్శనము తప్పకుండా చేసుకొని శ్వేతార్కమూలగణపతిస్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. అన్ని పూజా కైంకర్యాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు. భక్తులు కొబ్బరికాయ,పూలు,గజమాలలు,పూలదండలు దేవాలయంలో అందించగలరు. పూర్తి వివరాలకై దేవాలయ సమాచార కేంద్రంలో సంప్రదించగలరు
ఇట్టి విషయాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా పంపించగలరు.
శ్రీ స్వామివారి కళ్ళు తెరచిన వీడియో యూట్యూబ్ లో చూడ వచ్చును.
https://youtu.be/h-piZRXMPeg
🙏
2