⚡SchoolEdu 👈 Join Now
June 4, 2025 at 02:01 AM
*🔊పుస్తకాల్లేని చదువులు* *🔶ఇప్పటికీ పూర్తవని ఇంటర్‌ పాఠ్యపుస్తకాల ముద్రణ* *🔷నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి* *🔶తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తం* *🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈసారి కనీసం మరో నెలా నెలన్నర రోజులు పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువుకోక తప్పదు. జూన్‌ 2న విద్యా సంవత్సరం మొదలైనా... ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతోపాటు మార్కెట్లోనూ విక్రయానికి పుస్తకాలు తీసుకురాలేక పోయారు. విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు, తెలుగు అకాడమీల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, జనరల్‌ గురుకుల కళాశాలలు, కేజీబీవీల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందించాల్సి ఉంది. ఒకవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు విధిస్తున్న అధికారులు... కళాశాలలు తెరిచేలోగానే పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.* *💥నాలుగున్నర లక్షల మందికి ఎదురుచూపులు* *🌀రాష్ట్రవ్యాప్తంగా 9.50 లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రెండేళ్లకు కలిపి 1.56 లక్షల మంది, విద్యాశాఖ పరిధిలోని ఇతర విద్యా సంస్థల్లో మరో 75 వేల మంది ఉంటారు. వీరందరికీ ఉచితంగా పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కార్పొరేట్‌ కళాశాలల్లోని విద్యార్థులకు ఆ కళాశాలలు సొంతగా ముద్రించిన మెటీరియల్‌ను అందిస్తాయి. ఇతర ప్రైవేట్‌ కళాశాల్లోనూ సగం మందే తెలుగు అకాడమీ పుస్తకాలను కొంటుంటారు. ఈసారి వారైనా కొనేందుకు అవి మార్కెట్లో లేకపోవడం గమనార్హం. మొత్తానికి నాలుగున్నర లక్షల మంది పుస్తకాలు లేకుండానే నెలన్నర రోజులు చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తెలుగు అకాడమీలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, ఒక అధికారిణికే ఐదు పోస్టుల బాధ్యతలున్నాయని, అకాడమీకి పూర్తిస్థాయి డైరెక్టర్‌ లేకపోవడంతో ముద్రణపై పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వస్తున్నాయి.* *💥ప్రతిపాదనల తిరస్కరణ... అయినా ఆలస్యమే...* *💠పాఠ్య పుస్తకాల్లో సిలబస్‌ మార్పుపై 2024 నవంబరు నుంచి ఇంటర్‌ బోర్డులో కసరత్తు జరుగుతోంది. ఎన్‌సీఈఆర్‌టీతో పోల్చితే ఇంటర్‌లో సిలబస్‌ అధికంగా ఉందని, దాన్ని తొలగిస్తే విద్యార్థులపై గణితం, భౌతికశాస్త్రంలో 15-20% భారం తగ్గుతుందని బోర్డువర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో వారంలో ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. అదే నెలాఖరులో వాటిని ప్రభుత్వం తిరస్కరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి పాత సిలబస్‌తోపాటు ఇతరత్రా మార్పుల్లేకుండా యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ సిలబస్‌లో మార్పులు చేస్తే... జూన్‌ 2లోగా పుస్తకాలు ఇచ్చే విషయమై ఇంటర్‌ బోర్డు అధికారులు భరోసా ఇవ్వని కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే... కళాశాలల పునఃప్రారంభానికి నెల రోజుల సమయమున్నా సకాలంలో పుస్తకాలను ముద్రించలేదు. ఈ విషయమై తెలుగు అకాడమీ మేనేజరు, ప్రింటింగ్‌ ఇన్‌ఛార్జి స్వర్ణలత మాట్లాడుతూ... ప్రథమ సంవత్సరం పుస్తకాల ముద్రణ పూర్తయిందని, ద్వితీయ సంవత్సరం పుస్తకాల ముద్రణ కొనసాగుతోందన్నారు. పుస్తకాలకు జిల్లాలకు చేర్చిన తర్వాత కళాశాలలకు నేరుగా పంపించాల్సి ఉంటుందన్నారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments