⚡SchoolEdu 👈 Join Now
June 8, 2025 at 02:10 AM
*🔊టీచర్లు లేరు.. పిల్లలెలా చేరుతారు?*
*🔶పాఠశాల నుంచి వర్సిటీ వరకు ఖాళీగా అధ్యాపక పోస్టులు*
*🔷వేల సంఖ్యలో ఖాళీలున్నా భర్తీ అంతంతమాత్రం*
*🔶వర్సిటీల్లోనూ సగానికిపైగా పోస్టులు ఖాళీయే*
*🍥హైదరాబాద్, జూన్ 7, ప్రభాతవార్త: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పాఠాలు బోధించాల్సిన అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు టీచర్, లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. పాఠాలు బోధించాల్సిన ఆధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటంతో.. బోధించే వారు లేకపోవడంతో ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థులు రావడం మానేస్తూ.. ప్రైవేటు విద్యా సంస్థల వైపు వెళుతున్నారు. బోధించే అధ్యాపకులు లేకపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత రెండేళ్లుగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలను కొత్తగా మంజూరు చేయగా.. వాటిలో బోధన, బోధనేతర సిబ్బందిని మంజూరు చేయలేదు. వాటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన రెండు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలకు సైతం టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను మంజూరు చేయలేదు. జూనియర్, డిగ్రీ కాలేజీలతోపాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ విద్యా శాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటి వరకు వాటిలో పోస్టులను మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కాలేదు. ఇప్పటికే రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు ఈ నెల 2 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.*
*💥పాఠశాలల్లో 15వేల టీచర్ పోస్టులు ఖాళీ..*
*🌀రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో సుమారు 15వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. వాటిలో సుమారు 4 వేల వరకు పదోన్నతుల ద్వారా భర్తీచేసే పోస్టులు ఉండగా.. మిగిలిన 11వేల వరకు డైరక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాల్సిన టీచర్ పోస్టులున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు సుమారు 30వేల వరకు ఉన్నాయి.వాటిలో 1.20 లక్షల ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కాగా వాటిలో ప్రస్తుతం 1.08 లక్షల మంది పనిచేస్తున్నారు. అదికూడా గత ఏడాది సుమారు 10వేల టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయడం మూలంగా, అయినప్పటికీ ఇంకా సుమారు 11వేలకి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2014లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 34 లక్షలు ఉండగా.. అదికాస్త 2024-25 విద్యా సంవత్సరానికి 23 లక్షలకి పడిపోయింది.*
*💥ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో..*
*💠రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొనసాగు తున్నాయి, వాటిలో 6,008 అధ్యాపక పోస్టులు మంజూర య్యాయి. ప్రస్తుతం వాటిలో 5,234 మందే రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు కొనసాగుతున్నారు. వీకిలొ సుమారు 3500 మంది వరకు 2023లో కాంట్రాక్ట్ లెక్చరర్ల నుంచి రెగ్యులర్ అయిన వారు ఉన్నారు.కాగా 1092 మంది జూనియర్ లెక్చరర్లను ఈ ఏడాది ఏప్రిల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించారు. దీంతో ప్రస్తుతం సుమారు 5234 మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు కొనసాగుతున్నారు. వారు కాకుండా మరో 774 జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి స్థానంలో కొందరు కాంట్రాక్ట్ విధానంలో, మరికొందరిని గెస్ట్ లెక్చరర్లుగా కొనసాగిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2014లో సుమారు 1.20 లక్షల మంది చేరితే అదికాస్త 2024-25 నాటికి 80 వేలకి పడిపోయింది.*
*💥ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో..*
*🥏రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 60 శాతం వరకు లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 149 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కొనసాగుతున్నాయి, వాటిలో ప్రభుత్వం 4115 మంది డిగ్రీ లెక్చరర్ల పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం సుమారు 1531 మంది రెగ్యులర్ లెక్చరర్లు కొనసాగుతున్నారు. వారిలో కూడా సుమారు 450 మంది 2023లో కాంట్రాక్ట్ లెక్చరర్ల నుంచి రెగ్యులరైజ్ అయిన వారు ఉన్నారు. వారు కాకుండా 2584 డిఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల స్థానంలో 1940 మంది గెస్ట్ లెక్చరర్లు కొనసా గుతుండగా.. మరో 459 మంది కాంట్రాక్ట్ లెక్టరర్లు కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన 17 డిగ్రీ కాలేజీలకు పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. కొత్త డిగ్రీ కాలేజీలకు పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ విద్యా శాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు, రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ విద్యార్థుల సంఖ్య 2014 నుంచి తగ్గుతూ వస్తున్నారు. 2014లో రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సుమారు 80వేల మంది చేరితే అదికాస్త ప్రస్తుతం 50 వేలకు చేరింది.*
*💥యూనివర్సిటీల్లో..*
*🛟ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ మరీ గందరగోళంగా మారింది. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యా పక పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తూ 2017లోనే ఉత్తర్వు లిచ్చినప్పటికీ.. వివిధ కారణాలతో ఇప్పటివరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియా మఠం జరగలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం కాకుండా మిగిలిన 11 యూనివర్సిటీల్లో 2,125 ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీతోపాటు మహాత్మాగాంధీ. శాతవాహన, పాలమూరు, సురవరం ప్రతాపరెడ్డి తెలుగువిశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూని వర్సిటీల్లో అయితే ఒక్క రెగ్యులర్ ప్రొఫెసర్ కూడా లేరు.ప్రస్తుతం రాష్ట్రంలో 219 ప్రొఫెసర్ పోస్టులతోపాటు, 792 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు.. అలాగే 1,114 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో 2018లో జారీచేసిన జిఒఎంఎస్ నంబర్ 22 ప్రకారం 122 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. ప్రస్తుతం అవి కాస్త 183కి చేరాయి. జేఎన్ టీ యూలో ప్రస్తుతం 146 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. గతంలో 2018లో జారీచేసిన జి.నంబర్ 8 నాటికి 102 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వం జారీచేసిన జిఒఎంఎస్ నంబర్ 34 ప్రకారం రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో 102 ప్రొఫెసర్ పోస్టులు, 234 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 725 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. మొత్తం 1,061 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూని వర్సిటీల్లో 219 ప్రొఫెసర్ పోస్టులు, 792 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 1,114 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m