⚡SchoolEdu 👈 Join Now
June 12, 2025 at 03:10 AM
*🔊TG Minister Portfolios: వివేక్‌కు గనులు, కార్మిక.. లక్ష్మణ్‌కు సంక్షేమం*
*🔶శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసులు*
*🔷కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు*
*🍥ఈనాడు, హైదరాబాద్: కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకొన్న ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జి.వివేక్‌కు గనులు, కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీస్ శాఖలు; వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులు, మత్స్యశాఖలు; అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖలను కేటాయించారు. ఇవన్నీ ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి వద్దనే ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పాత మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై రెండు రోజులుగా తీవ్రంగా జరిగిన చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. పాత మంత్రుల వద్ద ఉన్న శాఖలను కొన్నింటిని మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఎవరికీ కేటాయించకుండా ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నుంచే కొత్తవారికి కేటాయించడం వరకే ప్రస్తుతం పరిమితం కావాలని సీఎం రేవంత్‌రెడ్డితో జరిపిన చర్చల్లో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద జరిగిన చర్చల్లో కొందరు మంత్రుల శాఖలను మార్చాలనే ప్రతిపాదన తొలుత వచ్చినట్లు సమాచారం. కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల శాఖలు అటూ ఇటూ మారవచ్చని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఓ కీలక మంత్రి వద్ద ఉన్న ముఖ్యమైన శాఖను మారుస్తారనే ప్రచారం ఎక్కువగా సాగింది. అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా దీనిపై చర్చ జరిగిందని, ఈ సమావేశం తర్వాత కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు వరకే పరిమితం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m