
Julakanti Brahmananda Reddy
May 13, 2025 at 02:00 PM
నా గుండెచప్పుడైనా .. మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
👉 ఈ రోజు మే - 13 ను నా జీవితంలో మర్చిపోలేను... ఎందుకంటే మీరు నా గెలుపు కోసం పరితపించి.., త్యాగాలకు సిద్ధపడ్డ మరువలేని రోజు కూడా.. ఈ రోజే..
👉 గత ఏడాది ఇదే రోజున రాక్షస పాలనపై అలుపెరగని పోరాటం చేసి.., మీ పవిత్రమైన ప్రేమ పూర్వక ఓటుతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించి.., అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేసిన మీ నమ్మకం.., విశ్వాసాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను.
👉 రాక్షస, రాబంధుల మూకలతో మగ్గుతున్న మాచర్ల నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పి.., నవ శకానికి నాంది పలికే బాధ్యతను నాపై పెట్టారు.. చరిత్ర సృష్టించారు..
👉 అదే బాధ్యతతో అహర్నిశలు మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ.. నాపై మీరు చూపిస్తున్న ప్రేమా, అభిమానం, ప్రగాఢ విశ్వాసం.., నమ్మకాన్ని నేనెప్పుడూ నిలబెట్టుకుంటాను.
👉 మీయొక్క ఆశీర్వాదంతో ఈ 11 నెలల కూటమి పాలనలో మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి నాతోపాటు మీరందరూ నడిచి.., సహకరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు..
👉 అనునిత్యం నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి.., ప్రాంతాల ప్రగతి.., కార్యకర్తల సంక్షేమం.., అందరికీ సుపరిపాలనే నా లక్ష్యం..నా ధ్యేయం అని తెలియజేస్తూ..
మీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి.., మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు
#julakantibrahmanandareddy
❤️
👍
🙏
8