VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
May 23, 2025 at 09:27 AM
☘☘☘☘☘☘☘☘☘☘☘ *ఆస్తమా సమస్యలకు ఉపశమనం కొరకు* *జల్ నేతి (Jal Neti)* *అవసరమైనవి:* * నేతి పాత్ర * ఒక చిటికెడు ఉప్పు * గోరువెచ్చని నీరు -యోగులు శ్వాస మార్గాలను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగించేవారు. దంతాల శుభ్రతకు బ్రష్ చేయడం వంటిదే, జల్ నేతి ముక్కు శుభ్రతకు ఉపయోగపడుతుంది. -తలను ఒక పక్కకు వాల్చి, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో ఒక ముక్కు రంద్రము నుండి మరో రంద్రము ద్వారా విడిచిపెట్టినకో గొంతు వరకు శ్వాస మార్గాలను శుభ్రం చేస్తుంది. ఇలా పాత్రలో నీటితో రెండు వైపల చెయ్యాలి. *ఈ ప్రక్రియ చేస్తునంతసేపు నోరు తెరిచి ఉంచి శ్వాస తీసుకోవాలి.* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *5 యోగా శ్వాస వ్యాయామాలు (Pranayama)* *సూచనలు:* * సుఖాసనంలో కూర్చొని, వెన్ను నిటారుగా ఉంచండి. * ఆలోచనలు తగ్గించి ధ్యాసను శ్వాసపై కేంద్రీకరించండి. * ప్రారంభంలో యోగా గురువు మార్గదర్శనంలో చేయండి. *1. అనులోమ-విలోమ (Nadi Shodhana)* - కుడి ముక్కును బొటనవేలితో మూసి, ఎడమ ముక్కుతో ఊపిరి పీల్చండి. - ఎడమ ముక్కును మధ్యవేలితో మూసి, కుడి ముక్కుతో ఊపిరి విడవండి. - ఇలా రెండు వైపులా చెయ్యాలి. - *సమయం:* 2-5 నిమిషాలు. *2. భ్రామరి (Bhramari)* - చెవులను బొటనవేళ్లతో మూసి, ఇతర వేళ్లతో కళ్లను మూసుకోండి. - ముక్కుతో ఊపిరి పీల్చి, కొద్దిసేపు ఊపిరి బిగపెట్టి, మ్ అను ధ్వనితో ఊపిరి నెమ్మదిగా విడవండి. - *పునరావృత్తి:* 5 సార్లు. *3. ఉజ్జాయి ప్రాణాయామం* - ఊపిరి పీల్చి, తల ముందుకు వాల్చి, గొంతు నుండి శబ్దం వచ్చేలా ఊపిరి పీల్చండి. - కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుతో ఊపిరి విడవండి. ఇలా రెండు వైపులా చెయ్యండి. - *పునరావృత్తి:* 10-12 సార్లు. *4. కపాలభాతి (Kapalbhati)* - సాధారణంగా ఊపిరి పీల్చి, బలంగా ఊపిరి విడవండి. - ఊపిరి విడుదల సమయంలో కడుపును వెన్నెముక వైపు లాగండి. - *సమయం:* 2-5 నిమిషాలు. *5. భస్త్రిక (Bhastrika)* - బలంగా ఊపిరి పీల్చి, కడుపును విస్తరించండి. - బలంగా ఊపిరి విడిచి, నాభిని లోపలికి లాగండి. - *సమయం:* 1-2 నిమిషాలు. ☘☘☘☘☘☘☘☘☘☘☘ *ఆవిరి పట్టుట* - నీటిలో పసుపు, వేపాకు & తులసీ ఆకులను వేసి కాయండి. - వేడి నీటిని పాత్రలో పోసి, తలపై తువాలా/దుప్పటి వేసుకుని ఆవిరిని పీల్చండి. *ఫలితాలు:* - శ్వాస మార్గాలు స్వచ్ఛమవుతాయి. - ఆస్తమా, అలర్జీలకు ఉపశమనం. *గమనిక:* ప్రతిరోజు ఉదయం ఈ పద్ధతులను అనుసరించండి. 🌿 ☘☘☘☘☘☘☘☘☘☘☘
🙏 😢 3

Comments