
VRK's PMF DIET UNIVERSAL
May 29, 2025 at 09:28 AM
🥵🥴😵💫🦵💪🤒🤕
*లో కార్బ్, హై ఫ్యాట్ డైట్ చేసేటప్పుడు కొద్దీ మందిలో తేలికపాటి జ్వరం, కళ్ళు తిరుగుతున్నట్లు ఉండటం, కాళ్ళు, చేతులు కొంకర్లు తిరిగినట్లు, తిమ్మిర్లు, మొద్దుబారినట్లు ఉండటం, నడుము విరిచినట్లు, కదలలేనట్లు అనిపించడం, విపరీతమైన తలపోటు చూస్తూ ఉంటాం.*
*ఇందుకు ప్రధాన కారణాలు పరిష్కారాలు:*
1. *శరీరానికి సరిపడా నీళ్ళు తీసుకోకపోవడం* (కనీసం 4 లీటర్లు నీళ్ళు తీసుకోవాలి),
2. *శరీరానికి అందవలసిన సూక్ష్మపోషకాలు అనగా ఖనిజలవాణాలు, విటమిన్లు అందకపోవడం* (ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా డైట్ లో అనుమతి ఉన్న అన్ని రకముల కూరగాయలు, ఆకుకూరలు, మాంసకృత్తులు విధిగా తీసుకోవాలి, కూరగాయగా తీసుకోవటం ఇష్టం లేకపోతే, సూప్స్ రూపంలో తీసుకోవాలి),
3. *శరీరానికి సరిపడా ఫ్యాట్ అందకపోవడం* (డైట్ ద్వారా శరీరానికి గ్లూకోస్ తగ్గిస్తూన్నము కాబట్టి అందుకు ప్రత్యాన్మయంగా కనీసం 40gms తగ్గకుండా ఫ్యాట్ తప్పనిసరిగా తీసుకోవాలి)
4. *డైట్ నిర్దేశించిన 6 పిల్లర్స్ విధిగా తీసుకోకపోవడం* (40-80gms డైరెక్ట్ ఫ్యాట్, 3 నిమ్మకాయలు, 4 లీటర్ల నీళ్ళు, 1 లేదా 2 మల్టీవిటమిన్, 1000 mg ఫిష్ ఆయిల్ మరియు విటమిన్ డి మాత్రలు తప్పనిసరిగా ప్రతిరోజూ తీసుకోవాలి)
*సాదారణంగా డైట్ చేసే మొదటి 10-20 రోజుల్లో ఈ సమస్య చాలా మందిలో వస్తూ ఉంటుంది. మన శారీరానికి ఇప్పటికే గ్లూకోస్ ఇంధనం మీద నడవటం అలవాటు అయి ఒక్కసారిగా గ్లూకోస్ బదులు ఫ్యాట్ ఇవ్వటం చేత మారే ప్రక్రియలో ముందు ఇబ్బంది పడుతుంది.* వీటిలో కొన్ని లక్షణాలు కీటో ఫ్లూ కారణంగా కూడా వస్తాయి. *అవసరం అనిపిస్తే జ్వరానికి, ఓళ్లు నెప్పులకు మాత్రలు వాడుకోవచ్చు. కానీ పైన సూచించిన 4 సూచనలు తప్పనిసరిగా పాటించాలి*
🥵🥴😵💫🦵💪🤒🤕
👍
❤️
🙏
😂
🚬
19