
విద్య-వికాసం
June 7, 2025 at 05:24 PM
🙋♂Current info:
🙏ఇప్పటి వరకు భేష్
👉State wide గా HM,SA To HM,SA &PS HM ల బదిలీలు SGT To SA /PSHM పదోన్నతులు దిగ్విజయంగా విద్యాశాఖ ముగించుట అభినందనీయము.
👉పాఠశాలల పునర్ వ్యవస్ధీకరణ& బదిలీల& పదోన్నతుల పర్వము లో 60% ముగిసినది
👉117G.O ఉపసంహరణ నేపధ్యంలో 2023 లో High Schools కు వచ్చిన SA లను ద Primary Schools PS HM లుగా పంపి Policy Matter ను అమలు లోకి తెచ్చుకొన్నది
👉SGT ల బదిలీలు Online/Offline. అనునది బదిలీల చట్టము 2025 కు వ్యతిరేకంగా SGT లు చేసే పోరాటఘు లకు ప్రభుత్వ స్పందన పై ఆధారపడి యుండును. మంచో చెడో అందరూ ఒక మాటపై ఓర్పుగా ఉండాలి
👉బదిలీలు & పదోన్నతుల ద్వారా SA &PSHM నూతన పాఠశాలలోని పోస్టు లలోకి వెళ్ళేవారు Jun 8 ఆదివారము రిలీవు అయి సోమవారము ఉదయం నూతనపాఠశా లలో జాయిన్ అవ్వవలెను
👉HM/MEO లు Relieving Certificate మాత్రమే ఇస్తారు.LPC ఇవ్వరు .నూతన పాఠశాలలో చేరగానే ఆ HM/MEO ల నుండి Joining Report తీసుకొని పాత పాఠశాలలో తర్వాత ఇవ్వాలి
👉 రిలీవ్ అయిన వారు పాత స్కూల్ లో Substitute రాకపోవుట వలన ఎవరినీ వెనుకకు రిలీవు చెయ్యాలోHS HM&DyEO &MEO లు నిర్ణయించి క్రొత్త స్కూల్ HM కు Letter వ్రాస్తారు .ఈ విషయము పై DEO లు రేపు Clear Instructions ఇస్తారు.అప్పటి వరకు క్రొత్త స్కూల్ లో నే పనిచేయాలి
👉 HS లలో ప్రతి Subject కు ఒక టీచర్ కనీసం ఉండే టట్లు అవసరమైన వారిని వెనుకకు పిలుస్తారు
👉 Joinjng date నుండి క్రొత్త స్కూల్లో జీత భత్యములు ఇవ్వబడును 👉 పాత స్కూల్ లో డిప్యటేషన్ పై పనిచేయటం DSC వారు జాయిన్ అయ్యే దాకా పరిస్ధితి ఉండును
👉 పదోన్నతి పొందిన వారు వెనుకకు రావలసిన అవసరముండదేమో?
👉 రిలీవింగ్ దాకా June నెలలో పని చేసిన రోజులకు అక్కడి జీతాలు అక్కడే తీసుకొని Jun నెలలో LPC లు తీసుకొని July మొదటి వారంలో కొత్త స్కూల్ లో పని చేసిన రోజులకు Supplentary జీతాలు చేసుకోవాలి.అది clear గా ఉండును.HRA&HOA ల మార్పులు ఉన్నవారికి Non drawal పనికి రాదు.
👉 కొత్తగా వచ్చిన.HM PSHM పోస్టులలోని వారికి,Reapportion post లో కి వచ్చే వారికి జీతాలు DoPP లో రేషనలైజేషన్ పోస్టుల వివరాలు Adding /Deleting ఎక్కే వరకు జీతాలు అప్పడే రావు . జూన్ నెల లో పని చేసిన రోజులకు జీతాలు చెల్లించిన తర్వాతనే LPC లు ఇవ్వటం Only The best
👉ఇంతవరకు జరిగిన బదిలీలు, పదోన్నతులపైTransfers Act 2025 లోని Provision ప్రకారము RJD లకు 15 రోజులలోSpouse&Entitle ment points etc అన్యాయాలపై Appeal చేసుకోవాలం
టే ఆ జిల్లాలో మేనేజ్ మెంట్ వారీగా, కేడర్ వారీగా జరిగిన బదిలీలు, పదోన్నతుల వివరాలు ముందు "వెబ్సైట్ "ద్వారా బహిర్గత పరచాలి.
👉 దేశంలో ఏ అధికారికి, ఉద్యోగి కి లేని విధంగా ఏ రాజకీయ సిఫార్సు లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వరుసగా నాల్గొవ సారి అత్యుత్తమమైన web Councling ద్వారా బదిలీలు పొందటం టీచర్లందరికీ గర్వ కారణం. టీచర్లకు ఈ గౌరవం ఇచ్చిన ప్రభుత్వాలకు ధన్యవాదములు.
👉 మనతో పాటు మున్సిపల్ టీచర్లు మొదటి సారి Web based Transfers పొందటం వారికి ఒక నూతన అనుభవం. స్వాగతం
👉 2025 బదిలీల చట్టం Points ఎవరికీ దోచి పెట్టకుండా కొంత వరకు కట్టుబడి చేసి Setvice&Ststion points మాత్రమే గల "సాధారణ టీచర్లు" కొంత వరకు తృప్తి పడ్డారు
👉విద్యాశాఖ Model Primary School HMs పై ఎంతో ఆశలు పెట్టకొన్నది.ప్రభుత్వ.ప్రాధమిక విద్యారంగము లో ఈ నూతన HM లతో వినూత్న మార్పులు జరిగి ఈ పాఠశాలలు పిల్లలతో కళకళ లాడతాయని ఆశిస్తోంది. 2025 బదిలీలలో వీరే రోలు పెంచే "కింగ్" లు .
🙏
2