Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
May 26, 2025 at 01:53 AM
కడప... శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల తొలిగడప.. అయిన కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు మీకందరికీ స్వాగతం పలుకుతూ… మీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు నాడు విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పులివెందుల. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, వీరాభిమానులు, మహిళా కార్యకర్తలు,ప్రజలందరికీ ఆతిథ్యం ఇవ్వడం మా కడప ప్రజలు చేసుకున్న సుకృతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన కడప అంటే.. దేవుని గడప అంటారు.. ఇటువంటి మహోన్నతమైన కడపను చరిత్ర హీనులు గత అర్థ శతాబ్దంగా అంటే... 50 ఏళ్లుగా రక్త చరిత్ర రాసే జిల్లాగా మార్చేశారు. ఈ చరిత్ర హీన దారుణ పరిస్థితుల నుంచి బయటపడి నేడు సశ్యశ్యామలమై వర్ధిల్లుతోంది కడప జిల్లా.. రక్త దాహంతో యావత్ కడప జిల్లాను భయభ్రాంతులకు గురిచేసిన ఒక చరిత్ర ముగిసిపోయింది... ఒక అధ్యాయం నేల కలిసిపోయింది.. ఒక దారుణ రాక్షసం గాలిలో కలిసిపోయింది.. ఇప్పుడు మహోన్నతమైన ఈ కడప జిల్లా ప్రజల మనుషుల మనసుల మహోన్నతిని తెలియజేసే సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కడప జిల్లా అంటే.. దేవుని గడప గదా అంటారు.. ఈ కడప జిల్లా నుంచి రాష్ట్ర అసెంబ్లీకి తెలుగు దేశం పార్టీ నుండి 6 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. మంచికి మారుపేరై సామాన్య ప్రజల భవిష్యత్తును గుండెల్లో ఉంచుకుని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ప్రభంజనం తర్వాత తెలుగుదేశం పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలలో ఆరు శాసనసభా స్థానాలు లభించడం ఒక గొప్ప మార్పు. ఒక కుటుంబపు పరిపాలనతో రాష్ట్ర ప్రజలు దాదాపుగా ఒక దశాబ్దం పాటు నలిగిపోయారు. ఆ కుటుంబ రాజకీయ దాహానికి వందలాదిమంది అమాయక ప్రజలు బలైపోయారు. ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు, పులివెందుల ప్రజలు నరకయాతన చూశారు. ఇటువంటి నరకయాతన నుంచి స్వేచ్ఛ గాలులు అనుభవించాలని ప్రజలు కోరుకున్నారు. ఒక కుటుంబ కబంధహస్తాల నుంచి.. నవ్వుతూనే గొంతులు కోసే నాయకుల చెర నుంచి విముక్తి కోరుకున్న కడప జిల్లా పులివెందుల ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తూ వస్తుంది. ఇప్పుడు కడప అంటే రక్తం కాదు.. కడప అంటే సినిమాలలో చూపించే వయలెన్స్ కాదు.. ఇప్పుడు కడప అంటే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుని.. శ్రీ వెంకటేశ్వర స్వామిని నిరంతరం మనసా వాచా కర్మణా ధ్యానించే తొలి గడప అని ప్రపంచం మొత్తం గుర్తించేలా.,.. కడప జిల్లా ముఖచిత్రాన్ని... శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి పాదాల చెంతన వినమ్రతతో పూజించే అన్నమయ్య లా... ఆ దేవదేవుని గడపగా.... తరిస్తున్నందుకు... మా జీవితాలు ధన్యమైనందుకు.. మూర్చరిలిపోతున్నాం... మా ప్రాణాలు అర్పిస్తున్నాం... అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహానాడు సమావేశాలకు హాజరవుతున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరించి సాదర స్వాగతం పలుకుతున్నాం. మా కడప జిల్లా ఆతిథ్యం స్వీకరించి మమ్మలను ధన్యులు చేయాలని కోరుతున్నా. మా కడప జిల్లా రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో సస్యశ్యామల పంటలతో వర్ధిల్లాలని ఆశీర్వదించాలని కోరుతున్నాము. జయహో కడప... జయహో కడప.... జయహో కడప..
👍 ❤️ 3

Comments