VISWAM VOICE BREAKING NEWS
June 8, 2025 at 02:12 PM
పత్రికా ప్రకటన
జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపినాథ్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ లు తమ సంతాపాన్ని తెలియజేసారు. మాగంటి గోపినాథ్ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగుదేశం యువత అధ్యక్షుడిగా, అలాగే హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసారని అన్నారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం జూబ్లీహిల్స్ అభ్యర్దిగా నిలబడి గెలుపొందారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నామని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు.
తెలుగుదేశం ప్రకాష్ రెడ్డి