VISWAM VOICE BREAKING NEWS
VISWAM VOICE BREAKING NEWS
June 9, 2025 at 03:26 AM
*పత్రికా ప్రకటన* *మచిలీపట్నం బీచ్, తేదీ: 08.06.2025* *వైభ‌వోపేతంగా మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు* *చివ‌రి రోజున కూడా ప‌ర్యాట‌కుల శోభ‌తో బీచ్ ప‌రిస‌రాలు* *జ‌న సంద్రంగా మారిన మంగిన‌పూడి బీచ్‌* *మసులా బీచ్ ముగింపుకు ల‌క్ష‌లాది మంది రాక‌* *ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మసులా బీచ్ ఫెస్టివ‌ల్ వేడుక‌లు* *నాలుగు రోజులపాటు ప‌ర్యాట‌కులు దాదాపు 15 ల‌క్ష‌ల మంది పైగా రాక‌* ఆదివారం సాయంత్రం ప్ర‌జ‌ల హ‌ర్ష‌ద్వానాల మ‌ధ్య మంగినపూడి బీచ్ ఒడ్డున మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. గాయ‌నీ గాయ‌క‌లు పాడిన పాటలు ప్రజలను బాగా ఆక‌ట్టుకున్నాయి.. బంద‌రు కు చెందిన హీరో యోగేష్ (బంద‌రు బాయ్‌), హీరోయిన్ ఆక్రితి అగ‌ర్వాల్‌, సాహితి (పోలిమేరా హీరోయిన్‌) డైరెక్ట‌ర్ రాజేష్‌, చిత్రం శ్రీను, జూనియ‌ర్ రాజ‌శేఖ‌ర్ (గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్) లు ఆక‌ట్టుకున్నారు. ప్రొడ్యూస‌ర్ లు ర‌మేష్‌, శ్రీ దేవి మ‌ద్దాలి పాల్గొన్నారు. క్లాసిక‌ల్ డ్యాన్స్ అరుణోద‌య క‌ళా స‌మితి ప్ర‌ద‌ర్శించిన డ్యాన్స్ ఆక‌ట్టుకుంది.. ఫోక్ డ‌ప్పు డ్యాన్స్ అదిరింది. మ‌చిలీట‌పట్ణం కు చెందిన శ్రీ చ‌ర‌ణ్ టీమ్ పాడిన పాట‌లు అలరించాయి.. మ్యూజిక‌ల్ డైరెక్ట‌ర్ రామ్ మిరియాల యువత ను ఉద్దేశించి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.. ఆయన పాడిన మాయా..మాయ.. జిందగీ మొత్తం మాయ అంటూ పాడిన పాట, ఓహో చిట్టి..నీ నవ్వు అంటే.. లక్ష్మీ పటాసే.. అంటూ, చందమామ వచ్చిందా, రమ్మంటే వచ్చిందా అంటూ, రాధికా.. రాధికా అంటూ, లాలాగూడ, అంబర్పేట, డిల్లు అంటూ పాడిన పాట యువతను ఆకట్టుకుంది.. ఆయన పాడిన పాటలు ఆద్యంతం పర్యాటకుల్లో జోష్ నింపింది.. జ‌బ‌ర్థ‌స్త్ టీమ్‌ సునామీ సుధాక‌ర్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ద‌ర్శించిన ఎమ్మెల్యే జాబ్ రికమండేషన్ పొలిటికల్ స్కిట్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది.. సునామీ సుధాక‌ర్ ప్రదర్శించిన ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పాటలు పాడుతూ చేసిన గాలి పటాల డాన్స్ ఆకట్టుకుంది.. వారు ప్రదర్శించిన స్కిట్స్ కు ప్రజల నుంచి మద్దతు లభించింది.. కార్యక్రమంలో తొలుత చిన్నారుల బృందం ప్ర‌ద‌ర్శించిన‌ కూచిపూడి నాట్యం ఆకట్టుకుంది. నాంచరయ్య బృంద సభ్యుల డప్పు కళాకారుల నృత్య ప్రదర్శన కూడా ఆకట్టుకుంది ప్రేక్షకులకు ఆద్యాంతం వినోదాన్ని పంచిన మృదుల‌, చంద్రిక‌ యాంకరింగ్ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు, జిల్లా అధికారులు తదితరలు పాల్గొన్నారు.. *జారీ చేసిన వారు: సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్*

Comments