
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
June 13, 2025 at 09:23 AM
*బంటుమల్లి లో "మొబైల్ కాన్సర్ వాన్" కార్యక్రమంకు అద్భుత స్పందన!!👌*
* *అధిక సంఖ్యలో రావడం వల్ల వచ్చే నెలలో మళ్ళీ వస్తుంది అని MP గారి మాట*
* *కార్యక్రమం దగ్గర ఉండి సహకరించిన జనసైనికులకు ఎంపీ గారి అభినందనలు👏*
<<<<<>>>>>>
మచిలీపట్టణం MP శ్రీ బాలశౌరి గారి సహకారంతో BEL వారి CSR నిధులతో వచ్చిన " *మొబైల్ కాన్సర్ వాన్* " అధునాతన సదపాయాలు కలిగి వివిధ రకాల కాన్సర్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. కాన్సర్ ను ముందుగానే గుర్తించి వైద్యం చేయించుకుంటే కాన్సర్ వల్ల కలిగే మరణాలు తగ్గించాలనే సదుద్దేశ్యంతో మన ఊరిలోకి వచ్చి పరీక్షలు చేసేలా " *మొబైల్ కాన్సర్ వాన్* " రూపకల్పన చేసారు.
నిన్న బంటుమిల్లి లో జరిగిన ఈ క్యాంపు ప్రజలు బాగా ఉపయోగించుకున్నారు, TEST లు కోసం ప్రజలు అధిక సంఖ్యలో రావడం వల్ల ఇంకా చేయవలిసినవి ఉండడం వాళ్ల MP గారి ని రిక్వెస్ట్ చెయ్యటం జరిగింది , వెంటనే స్పందించి వచ్చే నెలలో మళ్ళీ పంపుతాము అని మాట ఇచ్చారు.
ఈ ప్రోగ్రాం దగ్గర ఉండి చూసుకున్న జనసైనికులు యడ్లపల్లి రూకేష్ గారిని, మారుబోయన సుబ్బు గారిని, రుద్రపాక సాయిరాం గారిని, గొట్రూ రవికిరణ్ గారిని, కంచడం భూపతి గారిని ప్రత్యేకంగా MP బాలశౌరి గారు అభినందించారు.
