
TTD UPDATES
June 4, 2025 at 03:11 AM
📢 తిరుమల తిరుపతి దేవస్థానాల తాజా ప్రకటన
🙏 శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకెన్ల జారీ విధానంలో తాత్కాలిక మార్పులు
➡️ ఇకపై శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు ఇవ్వరు.
➡️ అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, అక్కడే టోకెన్లు ఇస్తారు.
➡️ ఈ కొత్త విధానం జూన్ 6వ తేదీ (శుక్రవారం) సాయంత్రం నుంచి అమలులోకి వస్తుంది.
➡️ టోకెన్లు “ముందు వచ్చినవారికి ముందు” పద్ధతిలో ఇవ్వబడతాయి.
➡️ టోకెన్ తీసుకున్న భక్తులు తమ ఆధార్ చూపించి, శ్రీవారి మెట్టులో 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయాలి.
➡️ శనివారం దర్శనానికి, శుక్రవారం సాయంత్రం నుంచే టోకెన్లు మంజూరు చేస్తారు.
➡️ SSD టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లోనే అందుబాటులో ఉంటాయి.
📌 TTD విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ శాఖలు కలిసి భద్రత మరియు రద్దీ నియంత్రణకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి.
🛕 తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు ఈ మార్పును గమనించండి మరియు ముందుగానే టోకెన్లు తీసుకోండి.
🙏
👍
3