
Kadapa Heart Beats
June 8, 2025 at 01:55 PM
*శక్తి యాప్ సేవలు వినియోగించుకుని పోలీసు భద్రత పొందండి*
* కడప జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు శిల్పారామం సందర్శకులకు 'శక్తి' యాప్ గురించి అవగాహన కల్పించిన రిమ్స్ పి.ఎస్ ఎస్.ఐ సుభాష్ చంద్రబోస్
శక్తి యాప్ మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని
రిమ్స్ పి.ఎస్ ఎస్.ఐ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి ఆదివారం సాయంత్రం కడప నగర శివార్ల లోని శిల్పారామం సందర్శకులకు 'రిమ్స్ పి.ఎస్ ఎస్.ఐ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత. రక్షణ కొరకు అందుబాటులోకి తీసుకువచ్చిన 'శక్తి' యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో ప్రతి మహిళ, బాలికలకు, విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా రిమ్స్ పి.ఎస్ ఎస్.ఐ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆపద సమయంలో మహిళలు బాలికల కు ఈ శక్తి యాప్ ఎంతగానో ఉపయోగ పడుతుందని ప్రతి మహిళ విద్యార్థులు బాలికలు సెల్ఫోన్లో ప్లే స్టోర్ నందు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగత వివరాలు ఫోన్ నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి సూచించారు. ఎస్.ఓ.ఎస్ బటన్, డయల్ 112 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయగా పది నిమిషాల్లో మీ చెంతకు సంబంధిత పోలీస్ అధికారులు చేరుకొని మీయొక్క సమస్యను ,ఆపదను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతామని తెలిపారు.మహిళలు , చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాల పై డయల్ 100,112, చైల్డ్ లైన్ 1098, గృహ హింస 181, మహిళ వేధింపులు 1091,సైబర్ టోల్ ఫ్రి 1930, సైబర్ మిత్ర, సంబంధిత పోలీసు వారికి తక్షణమే సంప్రదించి పోలీసు వారు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ పి.ఎస్ ఎస్.ఐ సుభాష్ చంద్రబోస్ సూచించారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.