Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
May 28, 2025 at 08:43 AM
కడప మహానాడులో రేపటి భారీ బహిరంగ సభకు ప్రభుత్వ స్థాయిలో ఏర్పాట్లు – కార్యాచరణ సిద్ధం.!! తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా కడపలో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు అనూహ్యమైన స్పందన అందుతోంది. అనుకున్నదానికన్నా భారీగా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని… ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాం. ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్, సభ ప్రాంగణ ప్రవేశ మార్గాలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల్లో మహానాడు కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో సమీక్ష చేపట్టి అవసరమైన చర్యలు తీసుకున్నాం. మా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సభలో పాల్గొని చంద్రబాబు గారికి, లోకేష్ గారికి మద్దతుగా ఒక గొప్ప సందేశం ఇవ్వాలన్నదే మా లక్ష్యం. ప్రతి ఒక్కరికి ఆహ్వానం… మీకోసం మా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. మీ ఆదరణతో ఈ మహానాడు మరింత చరిత్రాత్మకంగా నిలుస్తుంది. – పోలంరెడ్డి దినేష్ రెడ్డి, APEMCL చైర్మన్.!! #mahanadu2025 #andhrapradesh #telugudesamparty
Image from Polamreddy Dinesh Reddy | TDP: కడప మహానాడులో రేపటి భారీ బహిరంగ సభకు ప్రభుత్వ స్థాయిలో ఏర్పాట్లు – కార...

Comments