
Polamreddy Dinesh Reddy | TDP
June 4, 2025 at 03:07 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఏర్పాట్లు.. 🌱🌱
రేపు జరగబోయే ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకొని అమరావతిలో నిర్వహించబోయే ప్లాంటేషన్ కార్యక్రమం మరియు పర్యావరణ పరిరక్షణపై మన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను సమీక్షించేందుకు సభా ప్రాంగణాన్ని పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక స్టాల్స్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న వివిధ పర్యావరణ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ స్పెషల్ సీఎస్ అనంత రామ్ ఐఏఎస్, చలపతి ఐఏఎస్, కార్పొరేషన్ చైర్మన్ జిఎం వెంకటేశ్వర్లు గారు తదితర అధికారులు పాల్గొన్నారు.
#worldenvironmentday #plantationdrive #apemc
#greeninitiative #tdp4environment #cleanandgreenap

👍
❤️
3