Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
June 4, 2025 at 04:17 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు..🌱🌍 రేపు జరగబోయే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని సభా ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు దిశా నిర్దేశం చేయనున్నారు. పచ్చదనం పెంపుదలతోపాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన స్టాల్స్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ (APEMC) మరియు పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (APPCB) కలిసి చేపట్టిన పర్యావరణ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో PCCF అధికారి AK నాయక్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ శ్రీ కృష్ణయ్య గారు, ఎన్విరాన్మెంట్ MD శ్రీ శరవన్ గారు, శ్రీ వెంకటేశ్వర్లు గారు తదితర అధికారులు పాల్గొన్నారు. #worldenvironmentday #plantationdrive #apemc #greeninitiative #tdp4environment #cleanandgreenap
Image from Polamreddy Dinesh Reddy | TDP: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో ప్రత్యేక ఏర్పా...
👍 2

Comments